ఆర్‌సీ 15 (RC15) కోసం రామ్ చ‌రణ్ (Ram Charan) ఇంత క‌ష్టప‌డుతున్నారా!!!

Updated on Jul 17, 2022 10:19 PM IST
ఆర్‌సీ 15లో రామ్ (Ram Charan)  మూడు గెట‌ప్పుల కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డుతున్నారు.
ఆర్‌సీ 15లో రామ్ (Ram Charan) మూడు గెట‌ప్పుల కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డుతున్నారు.

టాలీవుడ్‌లో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan)  'ఆర్.ఆర్.ఆర్ ' చిత్రంలో అల్లూరిగా న‌టించి మెప్పించారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన  'ఆచార్య ' సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించి ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రిచారు.  'ఆచార్య ' ఫ్లాప్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  'ఆర్‌సీ 15 ' అనే టెంప‌ర‌రీ టైటిల్ ఫిక్స్ చేశారు.  'ఆర్‌సీ 15 ' సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న‌ వర్క్ అవుట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.

జిమ్ వీడియో వైర‌ల్

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) 15వ సినిమా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీలో రామ్ చరణ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.

 'ఆర్‌సీ 15 'లో రామ్ మూడు గెట‌ప్పుల కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డుతున్నారు. ఒక్కో పాత్ర‌లో ఒక్కోలా క‌నిపించ‌నున్నారు. ట్రైనింగ్ నిపుణుడు రాకేష్ ఉడియార్ శిక్షణలో రామ్ క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టారు. రామ్ చరణ్ వర్క్ ఔట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

శంక‌ర్ మొద‌టి తెలుగు సినిమా

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించే సినిమాలు అన్ని కూడా వైవిధ్యమైన సబ్జెక్టులను, కొత్త కథాంశాలను డీల్ చేస్తూ ఉంటాయి. జెంటిల్‌మేన్, భార‌తీయుడు, రోబో వంటి చిత్రాల‌తో శంక‌ర్ సినీ రంగంలో రికార్డుల‌ను సృష్టించారు. శంకర్ తమిళ, హిందీ హీరోలతో త‌ప్ప.. తెలుగు హీరోల‌ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌లేదు.

దర్శకుడు శంక‌ర్ మొద‌టి సారి తెలుగు హీరో రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.  'ఆర్‌సీ 15 ' అనే టైటిల్‌తో  తెర‌కెక్కుతున్న  ఈ  సినిమాకు దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూ. 170 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read More:  హై ఓల్టేజ్ ప‌వ‌ర్ ఉన్న క్యారెక్ట‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ కోసం శంక‌ర్ సృష్టించాడా!

 

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!