డైరెక్టర్‌‌ శంకర్‌‌ సినిమా కోసం కొత్త లుక్‌లో రాంచరణ్‌ (Ram Charan).. వైరల్ అవుతున్న పిక్

Updated on Jul 02, 2022 04:26 PM IST
డైరెక్టర్ శంకర్‌‌ సినిమాలో రాంచరణ్‌ (Ram Charan) కొత్త లుక్‌
డైరెక్టర్ శంకర్‌‌ సినిమాలో రాంచరణ్‌ (Ram Charan) కొత్త లుక్‌

మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌ (Ram Charan) స్టైలిష్‌ లుక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రాంచరణ్. సినిమా సినిమాకు తనలోని టాలెంట్‌కు మెరుగుపెట్టుకుంటూ స్టార్‌‌ హోదాను సంపాదించుకున్నారాయన. తాజాగా రాంచరణ్‌, చిరంజీవి కలిసి నటించిన ‘ఆచార్య’ రిలీజై బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో రాంచరణ్‌ మరో సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అయ్యారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌‌తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కోసం చరణ్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ రాంచరణ్‌కు చెందిన ఒక లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

చార్మింగ్‌ లుక్‌లో చరణ్..

రాంచరణ్‌ (Ram Charan) ఈ వీడియోలోఎప్పటిలాగే చార్మింగ్‌గా కనిపిస్తున్నారు. శనివారం విడుదలైన ఆ ఫోటో రాంచరణ్ అభిమానులతోపాటు సినీ ప్రియులకు తెగ నచ్చేసింది. అయితే ఆ వీడియోలో రాంచరణ్‌ పూర్తిగా కనిపించడం లేదు. అయితే తన లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు చరణ్. ఈ వీడియోను షేర్ చేసిన ఆలిమ్ హకీమ్.. కొత్త వైబ్, కొత్త హెయిర్‌‌స్టైల్, కొత్త లుక్ మా సూపర్ డూపర్‌‌ కోసం  @alwaysramcharan అని ట్యాగ్ చేశాడు.  

 ఆచార్య సినిమా తర్వాత రాంచరణ్‌ శంకర్‌‌తో చేయబోయే సినిమా ఆర్‌‌సీ15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్ ఏ లుక్‌లో కనిపించబోతున్నారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్‌ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్‌‌గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ 2022 చివరికి పూర్తి కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి పోస్టర్‌‌గానీ, ఫస్ట్‌ లుక్‌గానీ విడుదల చేయలేదు చిత్ర యూనిట్.

రాంచరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌ నటిస్తోంది. శంకర్ – రాంచరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Read More : కామెడీ ఇష్టపడే సినీ ప్రేమికులు మిస్ కాకూడని పది టాలీవుడ్‌ (Tollywood) సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!