రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) సినిమా 'ఆర్‌సీ 15' ఆర్ట్ డైరెక్ట‌ర్‌ను మార్చిన శంక‌ర్ .. గొడ‌వ‌లే కార‌ణ‌మా!

Updated on Jul 31, 2022 04:58 PM IST
‘రాధేశ్యామ్’ సినిమాకు ప‌నిచేసిన ర‌వింద‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టిస్తున్న‌ 'ఆర్‌సీ 15'కు ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించార‌ట‌.
‘రాధేశ్యామ్’ సినిమాకు ప‌నిచేసిన ర‌వింద‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టిస్తున్న‌ 'ఆర్‌సీ 15'కు ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించార‌ట‌.

టాలీవుడ్ హీరో రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో 'ఆర్‌సీ 15' తెర‌కెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుంది. అయితే 'ఆర్‌సీ 15' నుంచి ఆర్ట్ డైరెక్ట‌ర్‌ త‌ప్పుకున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ద‌ర్శ‌కుడు శంక‌ర్ 'ఆర్‌సీ 15'తో పాటు క‌మ‌ల్ హాస‌న్ సినిమా కూడా తెర‌కెక్కిస్తున్నార‌నే టెన్ష‌న్ రామ్ ఫ్యాన్స్‌లో ఉంది. ఇప్పుడు మ‌రో వార్త రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌ను మ‌రింత కంగారు పెడుతోంది.
 

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ను మార్చిన శంక‌ర్

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే సినిమాలు ఎక్కువ‌గా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధిస్తాయి. 'భార‌తీయుడు' నుంచి 'రోబో' వ‌ర‌కు సామాజిక స‌మ‌స్య‌ల ఉన్న క‌థ‌లనే శంక‌ర్ చిత్రీక‌రించారు. మొద‌టిసారి శంక‌ర్ తెలుగు సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ‘రంగ‌స్థలం’ ఫేమ్ రామ‌కృష్ణ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే కొన్ని కార‌ణాల‌తో  రామ‌కృష్ణ 'ఆర్‌సీ 15' నుంచి త‌ప్పుకున్నార‌ట‌. ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో గొడ‌వ‌లు కార‌ణంగానే రామ‌కృష్ణ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) సినిమాకు వ‌ర్క్ చేయ‌డం లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

‘రాధేశ్యామ్’ సినిమాకు ప‌నిచేసిన ర‌వింద‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) న‌టిస్తున్న‌ 'ఆర్‌సీ 15'కు ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించార‌ట‌.

‘రాధేశ్యామ్’ సినిమాకు ప‌నిచేసిన ర‌వింద‌ర్‌ను 'ఆర్‌సీ 15'కు ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించార‌ట‌. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ట‌. రామ్ చ‌ర‌ణ్ కొత్త గెట‌ప్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 'ఆర్‌సీ 15'లో రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan) కు జోడిగా కియా అద్వానీ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరిష్ నిర్మిస్తున్నారు.

Read More:S. Shankar: శంక‌రా మ‌జాకా!!!.. ఒక‌టి కాదు రెండు సినిమాలు ఒకేసారి తెర‌కెక్కిస్తారా?.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!