అకీరా నంద‌న్ (Akira Nandan) మ్యూజిక్‌తో నా మ‌న‌సు నిండింది : మేజ‌ర్ హీరో అడ‌వి శేష్ (Adivi Sesh)

Updated on Jun 17, 2022 11:55 PM IST
అకీరా నంద‌న్ (Akira Nandan)రా సంగీతంతో   మ‌న‌సు నిండిపోయింద‌టూ అడ‌వి శేష్ త‌న సోష‌ల్ మీడియాలో తెలిపారు. 
అకీరా నంద‌న్ (Akira Nandan)రా సంగీతంతో మ‌న‌సు నిండిపోయింద‌టూ అడ‌వి శేష్ త‌న సోష‌ల్ మీడియాలో తెలిపారు. 

టాలీవుడ్‌లో పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌క్కువ సినిమాలే చేసినా కూడా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా ఉన్న న‌టుడు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌యుడు అకీరా నంద‌న్ (Akira Nandan) ఓ పియానో ప్లేయ‌ర్. ఇటీవలే అకీరా త‌న పియానోపై 'మేజ‌ర్' సినిమాలోని 'హృద‌య‌మా' సాంగ్‌ను  ప్లే చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. అకీరా సంగీతంతో తన మ‌న‌సు నిండిపోయింద‌ంటూ అడ‌వి శేష్, సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. 

అకీరా.. థ్యాంక్యూ - శేష్ 

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య‌ రేణుదేశాయ్ కుమారుడు అకీరా నంద‌న్ (Akira Nandan). అకీరాకు పియానో అంటే అమితమైన ఇష్టం. పియానో వాయించడంలో తాను ప్రత్యేకంగా ఓ కోర్సు కూడా చేశారు. అలాగే హీరో అడివి శేష్‌కు అకీరా పెద్ద అభిమాని కూడా. అందుకే మేజ‌ర్ సినిమా చూశాక..  ఆ చిత్రంలోని  'హృద‌య‌మా' సాంగ్‌ను అకీరా త‌న పియానోపై ప్లే చేశారు. ఆ వీడియోను అడివి శేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. పైగా ఆ పాటను త‌న‌ కోసం ప్లే చేసినందుకు 'థ్యాంక్యూ' అంటూ  సోషల్ మీడియాలో పోస్టు చేసి మరీ, శేష్ ధన్యవాదాలు తెలిపారు. ఆ పాట విన‌గానే త‌న మ‌న‌సు ఆనందంతో నిండిపోయింద‌న్నారు. 

అకీరా త‌ల్లి రేణు దేశాయ్ కూడా త‌న సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అకీరా మేజ‌ర్ పాట‌ల‌ను త‌న పియానోపై ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడని రేణు తెలిపారు. అకీరా ప్ర‌తీ పాట‌ను చాలా స‌ర‌దాగా ప్లే చేస్తార‌న్నారు.

న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న అకీరా 

అడ‌వి శేష్ మేజ‌ర్ సినిమా ప్రివ్యూ షోకు అకీరా నంద‌న్ (Akira Nandan) కూడా హాజ‌ర‌య్యాడు. ఆ షో నిమిత్తం ప్రత్యేకంగా దిగిన చిత్రాలలో అకీరా ఆర‌డుగుల ఎత్తులో సూప‌ర్‌గా క‌నిపించాడు. ఇక మెగా ఫ్యాన్స్ టాలీవుడ్‌లోకి 'అకీరా ఎంట్రీ ఎప్పుడా' అని ఎదురు చూస్తున్నారు. అకీరా ఇప్ప‌టికే యాక్టింగ్ కోర్స్‌ను పూర్తి చేశాడు. తండ్రి ప‌వ‌న్‌లా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు.

అంతేకాదు.. డాన్స్, మ్యూజిక్‌లో కూడా అకీరా త‌న టాలెంట్ చూపిస్తున్నాడు. అకీరా 'మేజ‌ర్' సినిమా పాటను పియానోపై ప్లే చేయ‌డం చూసి.. పవన్ అభిమానులు కూడా ముచ్చటపడుతున్నారు. ఈ యంగ్ టాలెంట్‌కు 'ఆల్ ది బెస్ట్' చెబుతున్నారు. 

Read More: Pawan Kalyan: అకీరా తల్లిదండ్రులుగా మేము గ‌ర్వ‌ప‌డుతున్నాం -ప‌వ‌న్, రేణుదేశాయ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!