Major Movie: 'మేజర్' సినిమాపై చిరంజీవి ప్రశంసలు.. యూనిట్ కు స్పెషల్ డిన్నర్!

Updated on Jun 14, 2022 08:33 PM IST
మేజర్ మూవీ యూనిట్ తో చిరంజీవి (Megastar Chiranjeevi with Major Movie Unit)
మేజర్ మూవీ యూనిట్ తో చిరంజీవి (Megastar Chiranjeevi with Major Movie Unit)

Major Movie: ముంబయి 26/11 ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. టాలీవుడ్  హీరో అడివి శేష్ టైటిల్ రోల్‌లో న‌టించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. సయీ మంజ్రేకర్‌ కథానాయికగా నటించింది. జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా కలిసి నిర్మించాయి. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మేజర్ మూవీ చూసి హీరో అడివి శేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి .. మేజర్ మూవీ ఒక సినిమా కాదు. ఒక నిజమైన ఎమోషన్. దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక వీర యోధుడి గాధ. సందీప్ ఉన్నికృష్ణన్ దేశం కోసం ఎలా తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించాడనేది భావి తరాలకు స్పూర్తి దాయకం అన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అంటూ ఈ చిత్రంలో నటించిన హీరో అడివి శేష్‌తో పాటు మేజర్ యూనిట్‌ను మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ చిత్రం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేేసారు.

అంతేకాదు అడివిశేష్ (Adivi Sesh) టీంను లంఛ్‌కు ఆహ్వానించారు. ఈ విష‌యాన్ని అడివిశేష్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. నేడు అత్యున్న‌త గౌర‌వంగా భావిస్తున్నా. మీరు మాతో గంట‌ల‌పాటు మాట్లాడారు. అద్బుత‌మైన లంఛ్ ఏర్పాటు చేశారు. సినిమాలో మీకు ఏ విష‌యం బాగా న‌చ్చిందో వివ‌రించారు. మీ మ‌న‌స్సు ఎంత బంగార‌మో ఇవాళ తెలిసింది..ఎంతో శ్ర‌ద్ద‌తో మీరు తెలివైన ప్ర‌శ్న‌లు వేశారు. మెగాస్టార్ అంటే నాకెప్పుడూ ఇష్టం..అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు అడివిశేష్‌.

మేజర్ మూవీ (Major Movie) తెలుగు రాష్ట్రాలతో పాటు  అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది.  ‘మేజర్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే  యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా  1 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. హీరోగా అడివి శేష్‌కు తొలి 1 మిలియన్ డాలర్ మూవీ ఇదే కావడం విశేషం. 

తెలుగు రాష్ట్రాల్లో 10 రోజు..  రూ. 0.76 కోట్ల షేర్ (రూ. 1.20 కోట్ల గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మిగతా భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 1.41 కోట్ల షేర్ (రూ. 2.5 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి సాలిడ్‌గా దూసుకుపోతుంది. మేజర్ మూవీ (Major Movie) ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే.. బాక్సాఫీస్ దగ్గర రూ. 19 కోట్లు వసూళు చేయాలి. కానీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని .. రూ. 10.17 కోట్లతో లాభాల్లోకి వచ్చింది. ఇక ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB మేజర్ మూవీకి 9.2 / 10 రేటింగ్ ఇచ్చింది. గతంలో అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ మూవీకి 7.8/10 రేటింగ్ ఇచ్చింది.  

Also Read: Major Movie: 'మేజర్' మూవీ ప్రీమియర్ షో లో సందీప్ ఉన్ని కృష్ణన్ తండ్రి భావోద్వేగం..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!