Pawan Kalyan: అకీరా తల్లిదండ్రులుగా మేము గ‌ర్వ‌ప‌డుతున్నాం -ప‌వ‌న్, రేణుదేశాయ్

Updated on May 24, 2022 11:19 AM IST
Pawan Kalyan: కుమారుడు అకీరా నంద‌న్ స్కూల్‌ గ్రాడ్యూయేషన్ డే వేడుక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్
Pawan Kalyan: కుమారుడు అకీరా నంద‌న్ స్కూల్‌ గ్రాడ్యూయేషన్ డే వేడుక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్

Pawan Kalyan:ప‌వ‌న్ క‌ల్యాణ్, రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరా నంద‌న్ పిక్ వైర‌ల్ అయింది. అకీరా స్కూల్‌ గ్రాడ్యూయేషన్ డే ఫోటోలు సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ్రాడ్యూయేష‌న్ వేడుక‌లకు హాజ‌ర‌య్యారు. అకీరా నందన్‌ స్కూల్‌ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 23న ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ గ్రాడ్యూయేషన్ డే వేడుక‌లు జ‌రిగాయి. అకీరా కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ వేడుక‌లకు హాజ‌ర‌య్యారు. త‌న మాజీ భార్య రేణుతో పాటు పిల్ల‌ల‌తో క‌లిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ప‌వ‌న్ క‌ల్యాణ్ రేణుదేశాయ్ హీరో హీరోయిన్లుగా బ‌ద్రి సినిమా చేశారు. ఆ సినిమా స‌మ‌యంలో ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. ఆ త‌ర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ప‌వ‌న్‌, రేణుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. కుమారుడు అకీరా నంద‌న్, కూతురు ఆద్య‌. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక కొనేళ్ల‌కు ప‌వ‌న్, రేణులు విడిపోయారు. ప‌వ‌న్‌తో విడాకుల త‌ర్వాత రేణు దేశాయ్ ద‌గ్గ‌రే అకీరా, ఆద్యలు పెరుగుతున్నారు. పిల్ల‌ల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. పిల్ల‌ల బ‌ర్త్ డే పార్టీల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్తుంటారు. అలాగే మెగా ఫ్యామిలీలో జ‌రిగే వేడుక‌ల‌కు రేణు త‌న ఇద్ద‌రి పిల్ల‌ల‌ను పంపుతుంటారు. 

 

అకీరా నంద‌న్ త‌ల్లిదండ్రులుగా తాము గ‌ర్వ‌ప‌డుతున్నామంటూ రేణుదేశాయ్ అన్నారు. స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్‌లోకి అకీరా అడుగుపెడుతున్నార‌న్నారు. అకీరా త్వ‌ర‌గా పెద్ద‌వాడు అయిపోయాడన్నారు. అకీరా నంద‌న్ త‌న సొంత టాలెంట్‌తో తాను అనుకున్న‌ది సాధించాలని కోరుకుంటున్నానని రేణుదేశాయ్ తెలిపారు. 

17 ఏళ్ల ఆకీరా నంద‌న్ చ‌దువుతో పాటు యాక్టింగ్‌పై కూడా ఆస‌క్తి ఉంది. పియానో బాగా ప్లే చేస్తాడు. త‌న స్కూల్ గ్రాడ్యూయేష‌న్ డేలో ఆర్.ఆర్.ఆర్. దోస్తీ సాంగ్ మ్యూజిక్ పియానోతో ప్లే చేసి ఆశ్చ‌ర్య ప‌రిచాడు. అకీరా నంద‌న్ స్కూల్‌ గ్రాడ్యుయేషన్ డేలో ప‌వ‌న్ క‌ల్యాణ్, రేణు దేశాయ్‌లు ఒకే వేదిక‌పై క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఆనంద ప‌డుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!