పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పొలిటికల్‌ టచ్‌ ఉన్న సీన్‌!

Updated on Sep 06, 2022 08:47 PM IST
భీమ్లానాయక్ హిట్ తర్వాత పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు
భీమ్లానాయక్ హిట్ తర్వాత పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు

పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందని మేకర్స్ చాలా నమ్మకంతో చెబుతున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.

సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది. ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పవన్‌ అభిమానులు ఫిదా అయ్యే వార్త ఒకటి నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ నెలలో పవన్‌ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నారు. ఏడాది చివరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో హరిహర వీరమల్లు సినిమా విడుదలకు రెడీ అవుతోంది.

భీమ్లానాయక్ హిట్ తర్వాత పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు

హై ఓల్టేజ్‌ సీన్స్‌..

మరోవైపు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశంలో హీరో, విలన్ మధ్య హై ఓల్టేజ్ సన్నివేశాలు ఉంటాయట. ఆ సన్నివేశాల్లో విలన్.. ఈ జనాల్లో ఒక్కరైనా నీ కోసం వస్తారా అంటూ నవ్వుతాడట.

విలన్ అంటే భయంతో మొదట హీరో కోసం ఏ ఒక్కరూ ముందుకు రారు. ఆ సమయంలో హీరో చెప్పే ఒక్కో డైలాగ్‌తో సాధారణ జనాలు ముందడుగు వేసి ఒక్కరు కాదు వందల మంది వచ్చాం అంటూ విలన్‌కు షాక్ ఇస్తారట. ఈ సన్నివేశం పవన్ అభిమానులతోపాటు జనసేన సైనికులకు కూడా కిక్ ఇస్తుందని తెలుస్తోంది.

జనసేన పార్టీకి సింక్ అయ్యే విధంగా హరిహర వీరమల్లు సినిమాలో ఆ సన్నివేశం ఉంటుందని.. ఒక మంచి మెసేజ్‌తోపాటు మంచి వారి పక్కన నిల్చుంటే ఎంతటి వారైనా ఏం చేయలేరు అంటూ ఈ సన్నివేశం ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి సన్నివేశాలు తప్పకుండా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు కిక్ ఇవ్వడం కన్ఫమ్‌ అని తెలుస్తోంది.

Read More : రథంపై దూసుకెళుతున్న పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. హరిహర వీరమల్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!