ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ హ‌ద్దులు దాటారు.. సంస్కారం నేర్పండి - లీలామ‌హ‌ల్ థియేట‌ర్ ఓన‌ర్

Updated on Sep 03, 2022 05:37 PM IST
విశాఖ‌లోని లీలా మ‌హ‌ల్ సెంట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు  హంగామా సృష్టించారు.
విశాఖ‌లోని లీలా మ‌హ‌ల్ సెంట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు హంగామా సృష్టించారు.

టాలీవుడ్ స్టార్ హీరో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా ప‌లు చోట్ల 'జ‌ల్సా' సినిమాను ప్ర‌ద‌ర్శించారు. విశాఖ‌ప‌ట్నంలోని లీలా మ‌హ‌ల్ థియేట‌ర్‌లో మాత్రం ప‌వ‌న్ అభిమానులు హ‌ద్దులు దాటారు. థియేట‌ర్ల‌లో ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తించి స్క్రీన్‌ను చింపేశారు. త‌న‌కు ల‌క్ష‌ల రూపాయ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు న‌ష్టం క‌లిగించార‌ని థియేట‌ర్ ఓన‌ర్ తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెడ్డ పేరు తెస్తారా? మంచి పేరు తెస్తారా? అనే విష‌యాన్ని అభిమానులే నిర్ష‌యించుకోవాల‌న్నారు. క‌రోనా నుంచి కోలుకున్నంటున్న త‌మ‌పై ప‌వ‌న్ అభిమానులు న‌ష్టం క‌లిగించార‌న్నారు. 

థియేట‌ర్‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ దాడి

విశాఖ‌లోని లీలా మ‌హ‌ల్ సెంట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు జల్సా సినిమా చూసేందుకు వెళ్లారు. థియేట‌ర్‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. బీర్ బాటిల్స్‌తో స్క్రీన్‌ను చించేశారు. థియేట‌ర్‌లోని కుర్చీల‌ను ఇర‌క్కొట్టేశారు. థియేట‌ర్ ఓన‌ర్‌కు న‌ష్టం క‌లిగించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సృష్టించిన బీభ‌త్సం వ‌ల్ల త‌మ‌కు రూ. 20 ల‌క్ష‌ల న‌ష్టం క‌లిగింద‌ని థియేట‌ర్ ఓన‌ర్ చెప్పుకొచ్చారు. 

తాము క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామ‌ని.. ప‌వ‌న్ అభిమానుల వ‌ల్ల నెల రోజులు థియేట‌ర్ మూసివేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. త‌మ‌కు జీతాలు లేకుండా రోజులు ఎలా గ‌డుస్తాయంటూ థియేట‌ర్ వ‌ర్క‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)  చెప్పే మంచి వారి అభిమానుల‌కు అర్థం కావ‌డం లేదా అంటూ ప్ర‌శ్నించారు. 

Read More: Hari Hara Veera Mallu: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప‌వ‌ర్ గ్లాన్స్ వీడియో రిలీజ్.. పులిలా తొడ‌గొట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!