Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్ ద్వారా సెలబ్రిటీల విషెస్ వెల్లువ..!

Updated on Sep 02, 2022 12:52 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) పుట్టినరోజు కావటంతో ఆయన అభిమానులు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) పుట్టినరోజు కావటంతో ఆయన అభిమానులు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Birthday) జన్మదినం నేడు. ఆయన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి మాత్రమే కాదు.. సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) పుట్టినరోజు కావటంతో ఆయన అభిమానులు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ నటించిన “జల్సా” సినిమా స్పెషల్ షోలు విడుదల చేశారు. దాదాపు 500కు పైగా థియేటర్లలో పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు వేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో పవన్ కొత్త సినిమాల అప్ డేట్స్ కూడా వస్తున్నాయి.

జనసేనాని తన 51వ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మహేష్ బాబు, రవితేజ, రామ్ పోతినేని సహా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పలువురు బీజేపీ నేతలు, ఏపీ సహా ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్, రాజ్యసభ ఎంపీ జీవీఎల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి అనేక మంది పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా చెప్పారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!