"థ్యాంక్యూ ట్విట్టర్ రివ్యూ" - బంగార్రాజు మళ్లీ హిట్ కొట్టాడంటూ నాగచైతన్య (Naga Chaitanya)పై ప్రశంసలు
టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) నటించిన 'థ్యాంక్యూ' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. పలు చోట్ల 'థ్యాంక్యూ' సినిమా ప్రివ్యూ షోలు ప్రదర్శించారు. 'మనం' చిత్రం తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబోలో విడుదలైన చిత్రం 'థ్యాంక్యూ'. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. 'థ్యాంక్యూ' సినిమాపై ప్రేక్షకులు, చై అభిమానులు ట్విట్టర్‌లో ఇచ్చిన రివ్యూలు ఎలా ఉన్నాయంటే..
మహేష్ అభిమానిగా చై అదరగొట్టారు
నాగచైతన్య (Naga Chaitanya) థ్యాంక్యూ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నటించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున కుమారుడు నాగచైతన్య మరో స్టార్ అభిమానిగా నటించడం గొప్ప విషయం అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. నాగచైతన్య మహేష్ బాబు సినిమా ఫెక్సీని దగ్గరుండీ మరీ ఓపెన్ చేయించే సీన్ ప్రస్తుతం ధియేటర్‌ను షేక్ చేయిస్తుంది.
సినిమా హిట్టే అట!
థ్యాంక్యూ సినిమా ఫస్ట్ హాఫ్ క్లాసిక్ హిట్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. సెకండ్ ఆఫ్ చాలా బాగుందని.. బంగార్రాజు (నాగచైతన్య) మళ్లీ హిట్ అందుకున్నాడని పోస్ట్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని తెలిపారు.
నాగచైతన్య నటన బాగుందని మరో నెటిజన్ తెలిపారు. ఈ సినిమాలు పాటలు చాలా బాగున్నాయన్నారు. ప్రొడక్షన్ విలువలు పాటిస్తూ థ్యాంక్యూ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.
చై ఫెక్సీలకు పాలాభిషేకాలు
నాగచైతన్య అభిమానులు థియేటర్ల ముందు పెద్ద పెద్ద ఫెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. థ్యాంక్యూ సినిమా నాగచైతన్యను బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నాగచైతన్యను పాలాభిషేకాలు చేస్తున్నారు.
నాగచైతన్య, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన 'థ్యాంక్యూ' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అమెరికాలో ఏకంగా 294 థియేటర్లలో 'థ్యాంక్యూ' సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వస్తుంది. నాగచైతన్యకు మరో బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. తమన్ 'థ్యాంక్యూ' సినిమాకు సంగీతం అందించారు. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. 'థ్యాంక్యూ' సినిమాను ముందు జూలై 8న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ విడుదల తేదీని మార్చారు. 'థ్యాంక్యూ' సినిమా జూలై 22న విడుదల అయింది.
Read More: అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) 'థాంక్యూ' సినిమా : టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !