కుటుంబంలో విషాదం తర్వాత షూటింగ్ లో పాల్గొన్న మహేష్ బాబు (Mahesh Babu).. బ్యాక్ టు వర్క్ అంటూ పోస్ట్!

Updated on Dec 04, 2022 11:27 AM IST
తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) హ‌ఠాన్మ‌ర‌ణంతో గ‌త కొద్ది రోజులుగా షూటింగ్‌ల‌కు దూరంగా ఉన్న మ‌హేష్‌బాబు తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాడు.
తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) హ‌ఠాన్మ‌ర‌ణంతో గ‌త కొద్ది రోజులుగా షూటింగ్‌ల‌కు దూరంగా ఉన్న మ‌హేష్‌బాబు తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాడు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘SSMB28’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తొలి షెడ్యూల్‌ను ముగించుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

మహేష్ బాబు పక్కన సంయుక్త మీనన్, పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 'అల వైకుంఠపురములో', 'వకీల్ సాబ్', 'అఖండ', 'భీమ్లా నాయక్', 'సర్కారు వారి పాట' వంటి చిత్రాలకు అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లకు దర్శకత్వం వహించిన ఎస్ఎస్ థమన్ 'SSMB 28'కి సంగీతం అందించనున్నారు.

తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) హ‌ఠాన్మ‌ర‌ణంతో గ‌త కొద్ది రోజులుగా షూటింగ్‌ల‌కు దూరంగా ఉన్న మ‌హేష్‌బాబు తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాడు. దాదాపు ఇర‌వై రోజుల విరామం త‌ర్వాత ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. స్పోర్ట్స్ జాకెట్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తోన్న ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్యాక్ టు వ‌ర్క్ అంటూ ఈ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. మ‌హేష్ బాబు పోస్ట్ చేసిన ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అయితే, మహేష్ పాల్గొన్నది సినిమా షూటింగ్‌లో కాదు.. ఓ యాడ్ షూటింగ్‌లో మహేష్ బాబు (Mahesh Babu In Ad Shoot) కెమెరా ముందుకు రావడంతో ఆయన తిరిగి షూటింగ్ చేయడం సంతోషంగా ఉందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ యాడ్ షూట్ కోసం మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఆయన లుక్‌కు ఫిదా అవుతున్నారు. మౌంటేన్ డ్యూ కమర్షియల్ యాడ్‌లో మహేష్ పాల్గొనడంతో ఇలా పనిలో బిజీగా మారితే, బాధను త్వరగా మర్చిపోవచ్చని ఆయన సన్నిహితులతో పాటు అభిమానులు చెబుతున్నారు.

Read More: మహేష్‌ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్‌ SSMB28 సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఐటెం సాంగ్..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!