ThankYou: 'థ్యాంక్యూ'లో న‌టించ‌డం నా అదృష్టం - నాగ చైత‌న్య‌ (Naga Chaitanya)

Updated on Jul 20, 2022 06:56 PM IST
'థ్యాంక్యూ' సినిమాతో తాను ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని నాగచైత‌న్య  (Naga Chaitanya) ప్రెస్ మీట్‌లో తెలిపారు.
'థ్యాంక్యూ' సినిమాతో తాను ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని నాగచైత‌న్య (Naga Chaitanya) ప్రెస్ మీట్‌లో తెలిపారు.

ThankYou: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) న‌టించిన‌ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘థ్యాంక్యూ’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా జూలై 22న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా 'థ్యాంక్యూ' చిత్ర యూనిట్  ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ చైత‌న్య‌తో పాటు విక్ర‌మ్ కుమార్, దిల్ రాజు, బీవీఎస్ ర‌వి పాల్గొన్నారు. ప్రెస్ మీట్‌లో నాగ‌చైత‌న్య ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపారు. 

విక్ర‌మ్ ద‌గ్గ‌ర మంచి క‌థ‌లున్నాయి - నాగ‌చైత‌న్య‌
'మనం' సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య (Naga Chaitanya), విక్ర‌మ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'థ్యాంక్యూ'. భారీ అంచ‌నాల‌తో ఈ సినిమా రిలీజ్ కానుంది. నటుడిగా త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చిన సినిమా 'థ్యాంక్యూ' అని నాగ చైత‌న్య అన్నారు. ఇలాంటి పాత్రను చేసే అవకాశం అరుదుగా లభిస్తూ ఉంటుందన్నారు.

విక్రమ్ కుమార్ గారు మంచి రైటర్ అని.. ఆయన దగ్గరే ఎన్నో మంచి కథలు ఉన్నాయ‌న్నారు చై. బీవీఎస్ రవిగారి కథ వినగానే క‌చ్చితంగా ఈ సినిమా చేద్ధామంటూ ముందుకు వ‌చ్చార‌న్నారు. విక్ర‌మ్‌తో సినిమా చేయ‌డం త‌న అదృష్టం అన్నారు.

'థ్యాంక్యూ' సినిమాతో తాను ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని నాగచైత‌న్య ప్రెస్ మీట్‌లో తెలిపారు. ఎన్నో అనుభవాలతో థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటికి వస్తారన్నారు. ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్, తుల‌సి గార్ల‌తో పాటు ఇత‌ర పాత్ర‌ల స‌పోర్టుతో త‌న జ‌ర్నీ సాగింద‌న్నారు. 

'థ్యాంక్యూ' సినిమాతో తాను ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాన‌ని నాగచైత‌న్య  (Naga Chaitanya) ప్రెస్ మీట్‌లో తెలిపారు.

సినిమా రిలీజ్ తేదీలో మార్పు
నాగ చైత‌న్య (Naga Chaitanya) న‌టిస్తున్న 'థ్యాంక్యూ' సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త‌మ‌న్ 'థ్యాంక్యూ' సినిమాకు సంగీతం అందించారు. చంద్ర‌బోస్ లిరిక్స్ రాశారు. 'థ్యాంక్యూ' సినిమాను ముందు జూలై 8న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ విడుద‌ల తేదీని మార్చారు. ఈ సినిమా జూలై 22న రిలీజ్ కానుంది. 

Read More:  అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) 'థాంక్యూ' సినిమా : టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!