సరికొత్త పాత్రలో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya).. ధూత (Dhootha) వెబ్ సిరీస్ కోసం అలాంటి పాత్రలో చైతూ!

Updated on Dec 10, 2022 11:25 AM IST
నాగచైతన్య ‘ధూత’ (Dhootha Webseries) వెబ్ సిరీస్ లో మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.
నాగచైతన్య ‘ధూత’ (Dhootha Webseries) వెబ్ సిరీస్ లో మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

టాలీవుడ్ యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) సినిమా ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలు చేస్తుంటాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’, ఆ తర్వాత వచ్చిన ‘బంగార్రాజు’ సినిమాల తర్వాత మళ్లీ హిట్ రుచిచూడలేదు చైతూ. అనంతరం చైతన్య స్పీడుకు ‘థాంక్యూ’ మూవీ బ్రేకులు వేసింది. విక్రమ్‌ కే.కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ కూడా పూర్తి చేసుకోకుండా థియేటర్‌లలో నుండి వెళ్లిపోయింది.

మరోవైపు.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మరోసారి విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమాకు ‘ధూత’ (Dhootha Webseries) అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు.

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ వెబ్ సిరీస్ లో చైతన్య.. బాబు అనే జర్నలిస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో పాజిటివ్ రోల్స్ లో ఎక్కువగా నటించిన నాగచైతన్య ‘ధూత’ (Dhootha Webseries) వెబ్ సిరీస్ లో మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ కోసం ఎంత రిస్క్ అయినా చేసే పాత్రలో చైతన్య కనిపించనున్నారట.

త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన అప్డేట్ ఇవ్వనున్నారు. ఈ సిరీస్ లో చైతన్య నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు. డైరెక్టర్ విక్రమ్ (Director Vikram K Kumar) సరికొత్త కథతో ఈ సిరీస్ ను తెరకెక్కించనున్నాడట. ఈ సిరీస్ ఖచ్చితంగా విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగచైతన్య (Naga Chaitanya) ‘మానాడు’ ఫేం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ సినిమా చేస్తున్నాడు. ‘కస్టడీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రంలో నాగచైతన్య పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More: దూత‌గా వ‌స్తున్న నాగ‌చైత‌న్య‌(Naga Chaitanya)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!