అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) 'థాంక్యూ' సినిమా : టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !

Updated on Jul 18, 2022 09:18 PM IST
'థాంక్యూ' సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రొడ్యూస్ చేస్తున్నారు.  నాగచైతన్య తొలి చిత్రం 'జోష్'కి కూడా ఈయనే నిర్మాత. 
'థాంక్యూ' సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాగచైతన్య తొలి చిత్రం 'జోష్'కి కూడా ఈయనే నిర్మాత. 

 

'థాంక్యూ'.. ఇప్పుడు అందరి కళ్లూ ఈ సినిమాపైనే ఉన్నాయి. అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఈ శుక్రవారం (జులై 22 తేదిన) 'థాంక్యూ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన టాప్ టెన్ ఆసక్తికరమైన విషయాలు మీకోసం 

విక్రమ్ కుమార్ డైరెక్షన్

13 B అనే చిత్రంతో దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ (Vikram Kumar). ఒకప్పుడు దర్శకుడు ప్రియదర్శన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విక్రమ్ కుమార్ తర్వాత తమిళంలో '24' అనే సినిమాను సూర్య కథానాయకుడిగా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు.అలాగే తెలుగులోనూ మనం, హలో, గ్యాంగ్ లీడర్ లాంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు మళ్లీ 'థాంక్యూ' సినిమాతో మన ముందుకు వస్తున్నారు. 

డైలాగ్స్ ఎవరు రాస్తున్నారు?

నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకు డైలాగ్స్ వ్రాసిన వెంకట్ డి పతి, అలాగే యంగ్ రైటర్ మిథున్ చైతన్య ఈ సినిమాకి సంభాషణలు వ్రాస్తున్నారు. 'మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే, మనం చేరిన గమ్యానికి విలువుండదని నా ఫ్రెండ్ చెప్పాడు' 'ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే, స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది'  లాంటి డైలాగ్స్ సినిమాలోని కంటెంట్ బలాన్ని చెప్పకనే చెబుతున్నాయి. 

పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ

పిసి శ్రీరామ్ (PC Sriram).. భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రఫర్. పైగా క్యూబ్స్ సినిమాస్ అనే డిజిటల్ సినిమా టెక్నాలజీ కంపెనీకి ప్రెసిడెంట్ కూడా. గీతాంజలి, శుభ సంకల్పం, ఖుషీ, ఇష్క్ లాంటి తెలుగు సినిమాలతో పాటు ప్యాడ్ మాన్, చీనీ కమ్, పా లాంటి హిందీ సినిమాలకు కూడా ఈయన ఛాయాగ్రహణం అందించారు. 'నాయకుడు' సినిమాకి ఉత్తమ ఛాయాగ్రహకుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఈయనే 'థాంక్యూ' సినిమాకి కూడా సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 

బివిఎస్ రవి కథనం

జవాన్, వాంటెడ్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన రచయిత బివిఎస్ రవి (BVS Ravi). ఈయనే ఈ సినిమాకి కూడా కథను అందిస్తున్నారు. సత్యం, ఖడ్గం, భద్ర, చక్రం, పరుగు, తులసి లాంటి  సూపర్ హిట్ సినిమాలకు కథా సహకారం అందించిన ఘనత రవికి ఉంది. 

 

 

Thank You Movie Poster

ముగ్గురు కథానాయికలు

రాశిఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్.. వీరు ముగ్గురూ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. రాశిఖన్నా (Raashi Khanna) విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన 'మనం' సినిమాలో గెస్ట్ ఎప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగచైతన్య లవర్‌గా ఓ అయిదు నిమిషాలు ఆమె కనిపిస్తారు. కానీ 'థాంక్యూ' చిత్రంలో కూడా ఆమే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

నవీన్ నూలి ఎడిటింగ్

'జెర్సీ' చిత్రానికి గాను ఉత్తమ ఎడిటర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న నవీన్ నూలి (Navin Nooli) 'థాంక్యూ' చిత్రానికి కూడా కూర్పరిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే చైతూ సోదరుడు అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను'కి కూడా ఈయనే ఎడిటింగ్ సేవలు అందించారు. 

తమన్ మ్యూజిక్

అక్కినేని ఫ్యామిలీకి మ్యూజిక్ అందించడం తమన్‌‌కు కొత్తేమీ కాదు. గతంలో నాగార్జున (రగడ), అఖిల్ (అఖిల్, మిస్టర్ మజ్ను), నాగచైతన్య (వెంకీమామ) చిత్రాలకు సంగీతం అందించిన తమన్ ఈసారి 'థాంక్యూ' సినిమాకి కూడా చెప్పుకోదగ్గ బాణీలనే అందించారు. 

దిల్ రాజు ప్రొడక్షన్‌లో..

'థాంక్యూ' సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ప్రొడ్యూస్ చేస్తున్నారు. విచిత్రమేంటంటే నాగచైతన్య తొలి చిత్రం 'జోష్'కి కూడా ఈయనే నిర్మాత. 

 

Thank You Movie Poster

కీలక పాత్రలో సాయి సుశాంత్ రెడ్డి

ఈ నగరానికి ఏమైంది, బొంబాట్ లాంటి సినిమాలలో నటించిన సాయి సుశాంత్ రెడ్డి 'థాంక్యూ' సినిమాలో కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో చైతూతో కలిసి ఈయన హాకీ ఆడే సన్నివేశాలు కూడా ఉన్నాయట. 

మూడే మూడు సాంగ్స్

ఈ సినిమాలో ఉన్నవి మూడు పాటలు మాత్రమే. అందులో ‘మారో మారో’ అనే పాట ఇప్పటికే సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ పాటను విశ్వ, కిట్టూ విస్సాప్రగడ వ్రాయగా దీపు, పృథ్వి ఆలపించారు. అలాగే ‘ఏంటో ఏంటేంటో‘ అనే పాటను అనంత్ శ్రీరామ్ వ్రాయగా, జోనితా గాంధీ ఆ గీతాన్ని ఆలపించారు. అలాగే వైవిధ్యంగా సాగే ఫేర్వెల్ సాంగ్‌ని చంద్రబోస్ వ్రాయగా, అర్మాన్ మాలిక్ గానం చేశారు. 

ఏదేమైనా, ‘థాంక్యూ‘ సినిమాపై చై అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి.  బాల్యం, కౌమారం, యవ్వనం.. ఇలా మూడు దశలలో ఓ వ్యక్తి జీవితాన్ని ప్రతిబింబించే కథలు గతంలో చాలా సినిమాలుగా వచ్చాయి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరిస్, ప్రేమమ్ లాంటి చిత్రాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

అయితే ‘థాంక్యూ‘ సినిమాలో సబ్జెక్టు కూడా అదే కోవకు చెందిన కథలా కనిపిస్తున్నప్పటికీ.. ఏదో తెలియని ట్విస్ట్ కూడా చిత్రంలో కచ్చితంగా ఉందనే అనిపిస్తోంది. ట్రైలర్ చూడగానే ఎవరికైనా ఆ విషయం అర్థం అవుతుంది. ఇక, సినిమా ఎలా ఉందో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. 

Read More: నాగచైతన్య (Naga Chaitanya) ‘థ్యాంక్యూ’ సినిమా విడుదల తేదీలో మార్పు.. వెల్లడించిన చిత్ర యూనిట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!