Thank you Trailer: హృదయాన్ని తాకుతున్న నాగచైతన్య (Naga Chaitanya) మూవీ ‘థ్యాంక్యూ’ ట్రైలర్..!

Updated on Jul 13, 2022 01:41 PM IST
‘థ్యాంక్యూ’ మూవీ పోస్టర్ (Thank You Poster)
‘థ్యాంక్యూ’ మూవీ పోస్టర్ (Thank You Poster)

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘థ్యాంక్యూ’ (Thank you). ఈ సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 'మనం' తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

రాశి ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అవికా గోర్, మాళవిక నాయర్, సుశాంత్ రెడ్డి తదితరులు ‘థ్యాంక్యూ’లో  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 22 తేదిన థియేటర్లలో రిలీజ్‌ కానుంది. 

ఇప్పటికే ‘థ్యాంక్యూ’ (Thank You) సినిమా నుండి విడుదలైన పాటలు.. అలాగే టీజర్ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా చూసిన రైటర్ బీవీఎస్ ప్రసాద్ చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ ఫైనల్ కట్ చాలా బాగుందని తెలిపారు. నాగచైతన్య చేసిన అభిరామ్ పాత్ర అతని కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌గా నిలుస్తుందని కితాబునిచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి,

ఇక, ‘థ్యాంక్యూ’ (Thank You) సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చై అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను, నిన్నే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా విడుదల చేసింది.

ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ ఔట్ అండ్ ఔట్ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించారు. ఈ విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌లో దర్శకుడు పలు రకాల ఎమోషన్స్‌ను చూపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాడు.

‘థ్యాంక్యూ’ సినిమా ట్రైలర్‌లో నాగచైతన్య (Naga Chaitanya) డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. ఇక రాశీఖన్నా-చైతు కాంబినేషన్ కూడా క్యూట్‌గా ఉంది. ఈ ట్రైలర్‌ ఆసాంతం, నాగచైతన్య తన పాత్రకు సంబంధించిన సక్సెస్ జర్నీ గురించి చెప్పే ప్రయత్నం చేశారు.

‘‘మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువుండదని నా ఫ్రెండ్ చెప్పాడు..’’ అనే సూపర్బ్ డైలాగ్‌తో ఈ సినిమా కాన్సెప్ట్‌ను మనకు చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

Read More: Nagachaitanya-Raashi Khanna: 'థాంక్యూ' మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్న నాగచైతన్య, రాశీ ఖన్నా..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!