Sarkaru Vari Paata: 'స‌ర్కారు వారి పాట ' ప్ర‌పంచ వ్యాప్తంగా చేసిన బిజినెస్ ఎంతంటే..?

Updated on Jun 17, 2022 06:01 PM IST
Sarkaru Vari Paata:  'స‌ర్కారు వారి పాట ' ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది.
Sarkaru Vari Paata: 'స‌ర్కారు వారి పాట ' ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది.

Sarkaru Vari Paata: మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పరశురామ్ పెట్ల ద‌ర్శ‌క‌త్వం అద్భుతంగా ఉందంటూ ప్రేక్ష‌కులు మెచ్చుకున్నారు. మ‌హేష్, కీర్తి సురేష్ ల‌వ్ ట్రాక్ కూడా బాగుంద‌ని ఆడియ‌న్స్ తీర్పు ఇచ్చేశారు. అయితే ఈ సినిమా ఎంత బిజినెస్ చేసిందో తెలుసా?. క‌లెక్ష‌న్ల ప‌రంగా  'స‌ర్కారు వారి పాట ' ఎన్ని కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టిందంటే...?

నెగెటివ్ టాక్‌తో హిట్ కొట్టింది
 'స‌ర్కారు వారి పాట ' మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మొద‌ట నెగిటివ్ టాక్ న‌డిచినా.. షో.. షోకు పాజిటివ్ టాక్ పెరిగిపోయింది.  'స‌ర్కారు వారి పాట ' అమెరికాలో కూడా దుమ్ము రేపింది.

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జోడి బాగుందంటూ ప్రేక్ష‌కులు మెచ్చుకున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్ల‌స్ అయింది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అద్భుతంగా రాశారు. 

 'స‌ర్కారు వారి పాట ' త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది.  'స‌ర్కారు వారి పాట‌ ' చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్  జూన్ 24న  స్ట్రీమింగ్ చేయ‌నుంది.  'స‌ర్కారు వారి పాట ' సినిమా విడుద‌ల త‌ర్వాత ప‌లు పెద్ద సినిమాలు విడుద‌ల అయ్యాయి. దీంతో స‌ర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ కాలేదు.

స‌ర్కారు వారి పాట (Sarkaru Vari Paata) వ‌సూళ్లు
నైజాం – రూ.33.64 కోట్లు
సెడెడ్ - రూ.11.67 కోట్లు
ఈస్ట్ - రూ.8.55 కోట్లు
వెస్ట్ - రూ.5.65 కోట్లు
గుంటూరు - రూ.8.47 కోట్లు
కృష్ణ – రూ.5.88 కోట్లు
నెల్లూరు - రూ.3.51 కోట్లు
ఏపీ, టీఎస్ క‌లెక్ష‌న్ - రూ.90.07 కోట్లు
ఇండియా - రూ.7.00 కోట్లు
విదేశాల్లో: 13.05 కోట్లు
యూఏ - రూ.12.65 కోట్లు
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ - రూ.112.12 కోట్లు (రూ.185కోట్ల గ్రాస్)

ఎంత న‌ష్టం?
 'స‌ర్కారు వారి పాట ' (Sarkaru Vari Paata) ప్రీ రిలీజ్ బిజినెస్ విలువ రూ. 120 కోట్లు. అయితే విడుద‌ల త‌ర్వాత ఇండియాలో, అమెరికాలో మొద‌టి వారం ఈ చిత్రం బాగానే క‌లెక్ష‌న్ రాబ‌ట్టింది. రెండో వారంలో క‌లెక్ష‌న్ కాస్త త‌గ్గింది. ప‌లు సినిమాల రిలీజ్ కార‌ణంగా క‌లెక్ష‌న్ తగ్గింది.   'స‌ర్కారు వారి పాట ' సినిమా మ‌రో ఏడు కోట్ల రూపాయ‌లు వ‌సూళ్లు చేయాల్సి ఉంది. 

Read More: యూర‌ప్ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్న మ‌హేష్ బాబు (Mahesh Babu) .. ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రిన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!