యూర‌ప్ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్న మ‌హేష్ బాబు (Mahesh Babu) .. ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రిన్స్ !

Updated on Jun 16, 2022 05:49 PM IST
మ‌హేష్ బాబు (Mahesh Babu) కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార‌ల‌తో విదేశాల్లో సంద‌డి చేస్తున్నారు.  సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
మ‌హేష్ బాబు (Mahesh Babu) కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార‌ల‌తో విదేశాల్లో సంద‌డి చేస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్ బాబు (Mahesh Babu) యూర‌ప్ దేశాల్లో సంద‌డి చేస్తున్నారు. ఫ్యామిలీతో క‌లిసి హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ప్రిన్స్. మొద‌ట మ‌హేష్ స్విట్జర్లాండ్ దేశంలో సంద‌డి చేశారు. అక్క‌డి నుంచి ఇట‌లీ చేరుకున్నారు. మ‌హేష్ బాబుతో పాటు అత‌ని భార్య స‌మ‌త్రా శిరోద్క‌ర్ కూడా త‌న ఇన్ స్టాలో టూర్ ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు. 

ఇట‌లీలో మ‌హేష్ అండ్ ఫ్యామిలీ
మ‌హేష్ బాబు (Mahesh Babu) కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార‌ల‌తో విదేశాల్లో సంద‌డి చేస్తున్నారు. ఫారెన్‌లో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేసిన మ‌హేష్ ఓ కామెంట్ కూడా పెట్టారు. ‘ఇక్కడ ఇప్పుడు.. జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నాం’’ అంటూ పోస్ట్ పెట్టారు. మ‌హేష్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ కూడా త‌న ఇన్ స్టాలో టూర్ ఫోటోల‌ను షేర్ చేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ఇట‌లీలో ఉన్నారు. 

మ‌హేష్ బాబు (Mahesh Babu) షేర్ చేసిన ఫోటోల‌ను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'వావ్ మ‌హేష్ ' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌హేష్ బాబు న‌టించిన 'స‌ర్కారు వారి పాట ' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించింది. యూర‌ప్ టూర్ త‌ర్వాత మ‌హేష్ త‌న నెక్ట్స్ సినిమాల‌ను మొద‌లు పెట్ట‌నున్నారు. 
 
రాజ‌మౌళితో పాన్ ఇండియా సినిమానా!
మహేష్ బాబు 28వ సినిమాను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నారు. త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో మ‌హేష్ బాబు, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 'అర్జునుడు ' అనే టైటిల్ ఖ‌రారు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  ఇక మహేష్ బాబు తన 29వ సినిమాను ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నారు.

పాన్ ఇండియా సినిమాలో మ‌హేష్ న‌టించ‌నున్నార‌ట‌.ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ లో KL నారాయణ నిర్మిస్తున్నారు.  దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రాజ‌మౌళి, మ‌హేష్ కాంబినేష‌న్ సినిమా రానుంద‌ట‌. 

Read More: Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంటిని మీరెప్పుడైనా చూశారా? నిజంగానే ఇది ఓ అద్భుత నిలయం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!