మురారి పాట‌తో థియేట‌ర్ల‌ను షేక్ చేయ‌నున్న స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) 

Updated on Jun 02, 2022 11:38 AM IST
Sarkaru Vaari Paata: మురారి పాట‌ను స‌ర్కారు వారి పాట సినిమాకు జోడిస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.
Sarkaru Vaari Paata: మురారి పాట‌ను స‌ర్కారు వారి పాట సినిమాకు జోడిస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు జంట‌గా న‌టించిన 'స‌ర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో మ‌రో పాట‌ను యాడ్ చేస్తున్నారు. మురారి సాంగ్‌ను 'స‌ర్కారు వారి పాట' సినిమాకు జోడిస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.  'మురారి ' సినిమా కూడా మ‌హేష్ బాబుకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆ పేరుతో పాట‌ను రాశారు అనంత శ్రీరామ్. థియేట‌ర్ల‌లో 'మురారి వా' సాంగ్ ఆడియ‌న్స్‌ను హుషారెత్తించనుంది. 

పరశురామ్‌ దర్శకత్వం వ‌హించిన స‌ర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాలో మ‌హేష్ బాబును స్టైలిష్‌గా చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. మే 12న రిలీజ్ అయిన స‌ర్కారు వారి పాట థియేట‌ర్ల‌ల‌లో ఇంకా సంద‌డి చేస్తోంది. ప్రేక్ష‌కులు మ‌రోసారి థియేట‌ర్ల‌కు వ‌చ్చేలా చిత్ర యూనిట్ 'మురారి వా' పాట‌ను ప్లాన్ చేసింది. 

తొలుత 'మురారి వా' పాటను మాస్ సాంగ్‌గా జోడించాలని అనుకున్నారు. కానీ మ‌.. మ‌.. మ‌హేశా పాట సాంగ్‌కు మంచి ట్యూన్ సెట్ అవ‌డంతో ఈ పాట‌ను జోడించారు. 'మ‌హేశా' సాంగ్‌లో మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌ల స్టెప్పులు అద‌ర‌గొట్టారు. వీరి స్టెప్పుల‌కు ప్రేక్ష‌కులు నోట్ల వ‌ర్షం కురిపించారు. 'మ‌హేశా ' పాట‌ను సూప‌ర్ హిట్ చేశారు. 

అలాగే అప్పుడు 'మురారి' పాట‌ను ప‌క్క‌న పెట్టిన చిత్ర యూనిట్... ఇప్పుడు ఆ పాట‌ను సినిమాకు జోడించారు. జూన్ 2 నుంచి థియేట‌ర్ల‌లో 'మురారి ' సాంగ్‌తో  స‌ర్కారు వారి పాట సినిమా (Sarkaru Vaari Paata) ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

Read : మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ సినిమాపై ఆనంద్ మహీంద్రా కామెంట్స్.. వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!