Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంటిని మీరెప్పుడైనా చూశారా? నిజంగానే ఇది ఓ అద్భుత నిలయం !

Updated on Jun 21, 2022 04:44 PM IST
మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇల్లు చూస్తే ఓ ఇంద్ర‌భ‌వ‌నంలా క‌నిపిస్తుంది.
మ‌హేష్ బాబు (Mahesh Babu) ఇల్లు చూస్తే ఓ ఇంద్ర‌భ‌వ‌నంలా క‌నిపిస్తుంది.

మహేష్ బాబు (Mahesh Babu).. ఆ పేరులోనే ఓ వైబ్రేష‌న్ ఉందంటారు అభిమానులు. టాలీవుడ్‌లో  మ‌హేష్ బాబుకు ఉన్న క్రేజే వేరు. అందంతో పాటు అభినయంలో కూడా మ‌హేష్ బాబు టాపే. ప్రస్తుతం బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు మ‌హేష్ బాబు. అలాగే, త‌న ఇల్లే త‌న ప్ర‌పంచం అని ఓ యాడ్‌లో మ‌హేష్ చెప్పారు. ఈ క్రమంలో మ‌హేష్ అంతర ప్ర‌పంచం ఎలా ఉంటుందో.. ఆ  హీరో గారి ఇంద్ర‌భ‌వ‌నంలో ఉన్న ప్ర‌త్యేక‌త‌లు ఏంటో మనం తెలుసుకుందామా ..

మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివే

మ‌హేష్ బాబుతో పాటు అత‌ని భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ కూడా సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. మ‌హేష్ ట్విటర్‌లో త‌న కెరీర్‌కు సంబంధించిన పోస్టులను ఎక్కువ‌గా పెడుతుంటారు. న‌మ్ర‌తా కూడా త‌న ఫ్యామిలీకి చెందిన విషయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌కు షేర్ చేస్తూ ఉంటారు. వీరి పిల్ల‌లు కూడా సామాజిక మాధ్యమాలలో చురుగ్గానే ఉన్నారు.

చిత్రమేంటంటే, గౌత‌మ్ కంటే సితార త‌న సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా పోస్టులు పెడుతుంటుంది. ఇవన్నీ కాసేపు పక్కనపెడితే,  మ‌హేష్ బాబు లైఫ్ స్టైల్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.

మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇల్లు చూస్తే ఓ ఇంద్ర‌భ‌వ‌నంలా క‌నిపిస్తుంది.

మహేష్ బాబు ఇల్లు ఎక్క‌డుంది?
మ‌హేష్ బాబు  (Mahesh babu) ఇల్లు ఎక్క‌డ ఉంద‌నే విష‌యం చాలా మంది తెలుసుకోవాల‌నుకుంటారు. మ‌హేష్ బాబు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ప్రిన్స్ ఇల్లు ఉంది. మ‌హేష్ బాబు ఉండే ఏరియాలోనే చాలామంది తెలుగు సినీ ప్ర‌ముఖుల ఇళ్లులు కూడా ఉన్నాయి. మ‌హేష్, న‌మ్ర‌తా ఉంటున్న ఇంటి విలువ దాదాపు రూ. 28 కోట్ల రూపాయ‌ల వ‌రకు ఉంటుంద‌ట‌. మ‌హేష్‌కు హైద‌రాబాద్‌లో మ‌రో ఇల్లు కూడా ఉంది. 

మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇల్లు చూస్తే ఓ ఇంద్ర‌భ‌వ‌నంలా క‌నిపిస్తుంది.

సూప‌ర్ స్టార్ కృష్ణ కుమారుడుగా మ‌హేష్ బాబు (Mahesh Babu)  సినిమాల్లోకి వ‌చ్చారు. మొద‌టి సినిమా రాజ‌కుమారుడుతోనే ఉత్తమ నూత‌న‌ న‌టుడుగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే, మ‌హేష్ బాబు బాల న‌టుడిగా 8 సినిమాల్లో న‌టించారు. హీరోగా మహేష్ 27 సినిమాలు చేశారు.'నిజం' సినిమాకు ఉత్త‌మ న‌టుడిగా మ‌హేష్ బాబు నంది అవార్డు అందుకున్నారు. అత‌డు, దూకుడు, శ్రీమంతుడు సినిమాల‌కు కూడా మ‌హేష్ బాబుకు ఉత్త‌మ న‌టుడిగా నంది పుర‌స్కారం వ‌రించింది. 

మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇల్లు చూస్తే ఓ ఇంద్ర‌భ‌వ‌నంలా క‌నిపిస్తుంది.

మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టించిన తొలి చిత్రంలో హీరోయిన్‌గా న‌మ్ర‌తా శిరోద్క‌ర్ యాక్ట్ చేశారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ వంశీ సినిమాలో హీరో హీరోయిన్లుగా న‌టించారు. మాజీ మిస్ ఇండియా న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌ను మ‌హేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార.

న‌మ్ర‌తా శిరోద్క‌ర్, సితార సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆ ఫోటోల‌లో మ‌హేష్ బాబు ఇల్లు చూస్తే ఓ ఇంద్ర‌భ‌వ‌నంలా క‌నిపిస్తుంది. ల‌గ్జ‌రీ ఫ‌ర్నీచ‌ర్, హోం థియేట‌ర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ చూస్తే ఓ మై గాడ్ అనాల్సిందే. 

మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్ చూస్తే ఫారెన్ లుక్‌లో క‌నిపిస్తుంది.

న‌మ్ర‌తా శిరోద్క‌ర్ త‌న ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇంటి డిజైనింగ్ చూస్తే క‌ళ్లు చెదిరిపోతాయి. ఇంట్లో ఎక్క‌డ చూసినా, ప‌చ్చ‌ని చెట్ల‌తో ల‌గ్జ‌రీ లుక్‌తో క‌నిపిస్తాయి. ఇక ఖరీదైన వుడ్ ఫ‌ర్నీచ‌ర్ ఇంటిని మెరిసేలా తీర్చిదిద్దాయి.

ఇంటి లోప‌ల స్విమ్మింగ్ పూల్
మ‌హేష్ బాబు క‌రోనా టైంలో స్విమ్మింగ్ నేర్చుకున్నార‌ని.. ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఈ హీరో ఇంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్ చూస్తే ఫారెన్ లుక్‌లో క‌నిపిస్తుంది. చుట్టూ ప‌చ్చని చెట్లు క‌నిపించేలా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది.

ఫ్రెంచ్ విండోస్ ఈ ఇంటికి మ‌రో ఎట్రాక్ష‌న్‌గా క‌నిపిస్తాయి. ఎంతో ల‌గ్జ‌రీగా క‌నిపించే స్విమ్మింగ్ పూల్‌లో మ‌హేష్, అత‌ని పిల్ల‌లు ఈత కొడుతూ స‌ర‌దాగా గ‌డుపుతుంటారు. ఆ ఫోటోల‌ను అప్ప‌డ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. 

మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్ చూస్తే ఫారెన్ లుక్‌లో క‌నిపిస్తుంది.

పిల్ల‌ల కోసం ప‌త్యేక గ‌దులు
గౌత‌మ్ కృష్ణ‌, సితార‌ల‌కు ప్ర‌త్యేక గ‌దులు ఉన్నాయి. సీతా పాప గ‌ది పింక్ క‌ల‌ర్‌తో క్యూట్‌గా ఉంటుంది. సిండ్రిల్లా, బార్బీ ఫోటోల‌తో అందంగా క‌నిపిస్తుంది. ఆమె గేమ్స్ ఆడుకోవడం కోసం ప‌త్యేకంగా ఓ రూం ఉంది. చ‌దువుకునేందుకు రీడింగ్ రూం కూడా ఏర్పాటు చేశారు. 

అవుట్ డోర్ గార్డెన్
అంద‌మైన గార్జెన్‌లో మ‌హేష్ బాబుతో పాటు, అత‌ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎంజాయ్ చేస్తుంటారు. వీరు త‌మ పెట్స్‌తో క‌లిసి ఇంటి బ‌య‌ట ఉన్న గార్డెన్‌లో షికారు చేస్తున్న ఫోటోలు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప‌చ్చ‌ని చెట్ల మ‌ధ్య‌లో పొల్యూష‌న్ లేని చోట‌.. చ‌ల్ల‌ని గాలిలో మ‌హేష్ ఫ్యామిలీ మెంబర్స్ రిలాక్స్ అవుతుంటారు. వాకింగ్, ర‌న్నింగ్ కూడా చేస్తుంటారు. 
 

మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్ చూస్తే ఫారెన్ లుక్‌లో క‌నిపిస్తుంది.

పూజ గ‌ది ప్ర‌త్యేకం
మ‌హేష్, న‌మ్ర‌తా ఇద్ద‌రూ హిందువులు. వీరి ఇంట్లో పూజ గ‌దిని ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు గ‌దిలో అన్ని హిందూ దేవ‌తామూర్తుల ఫోటోల‌ను ఉంచారు. న‌మ్ర‌తా సాయిబాబా భ‌క్తురాలు. న‌మ్ర‌తా ఇంట్లో అష్ట ల‌క్ష్మీ దేవీల‌తో క‌లిసిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఫోటోను గోడ‌పై ప్ర‌త్యేకంగా అలంక‌రించారు. ప్ర‌తీ పండుగ‌ను వీరు త‌ప్ప‌కుండా చేస్తుంటారు. 

మ‌హేష్ బాబు ఇంటి ద‌గ్గ‌ర‌లోనే ప‌లువురు టాలీవుడ్ హీరోలు ఉంటారు. రానా ద‌గ్గుబాటి,  నాగార్జున‌, నాగ‌చైతన్య‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల ఇళ్లు మ‌హేష్ ఇంటి ద‌గ్గ‌ర‌లోనే ఉంటాయి. 2016లో మ‌హేష్ బాబు ఇంద్ర‌భ‌వ‌నం లాంటి ఇల్లును క‌ట్టుకున్నారు.  ఘ‌ట్ట‌మ‌నేని హౌస్ అని పేరు పెట్టుకున్నారు. 

మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్ చూస్తే ఫారెన్ లుక్‌లో క‌నిపిస్తుంది.

విలాస‌వంత‌మైన భ‌వ‌నం
అద్భుత‌మైన  ఇంటీరియ‌ర్‌తో మ‌హేష్ ఇల్లు  విలాస‌వంతంగా క‌నిపిస్తుంది. లావిష్ సోఫాలు, ప్యూర్ లెద‌ర్ కుర్చీలు మనకు క‌నిపిస్తాయి. వుడ్‌తో చేసిన డైనింగ్ టేబుల్ ల‌గ్జ‌రీగా క‌నిపిస్తుంది. సింపుల్ అండ్ మైండ్ బ్లోయింగ్ లుక్ ఉండేలా మ‌హేష్ ఇంటి హాల్ ప్లాన్ చేశారు. ఇక గోడ‌ల‌పై ఉండే ల్యామినేష‌న్ ఫోటోలు ఎంతో అందంగా క‌నిపిస్తాయి.

ఇష్ట‌ప‌డి క‌ట్టించుకున్న ఇల్లు
మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌లు ఎంతో ఇష్ట‌ప‌డి వారుండే ఇంటిని క‌ట్టించుకున్నారు. ప్ర‌తీ గ‌దిని న‌మ్ర‌తా ద‌గ్గ‌రుండి మ‌రీ క‌ట్టించార‌ట‌. విదేశాల నంచి ఫర్నీచ‌ర్ తెప్పించార‌ట‌. ఆ ఇంటిని చూస్తే ఓ ఫారెన్ కంట్రీలో ఉన్నామా అనిపించేలా డిజైన్ చేశారు. మోస్ట్ ల‌గ్జ‌రీ హోం అనిపించేలా మ‌హేష్ బాబు ఇంటిని నిర్మించారు. 

మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్ చూస్తే ఫారెన్ లుక్‌లో క‌నిపిస్తుంది.

డాన్స్ కోసం ప్ర‌త్యేకం
సితార కూచిపూడి నాట్యం నేర్చుకుంటుంది. పిల్ల‌లు డాన్స్ నేర్చుకునేందుకు ప్ర‌త్యేక గ‌దిని క‌ట్టించారు. విశాలంగా ఉంటూ.. అద్దాల‌తో ఆ గ‌ది డిజైన్ చేశార‌ట‌. 

మ‌హేష్ బాబు కుటుంబ స‌భ్యులు అత‌ని ఇంట్లో అప్ప‌డ‌ప్పుడూ క‌లుస్తుంటారు. బ‌ర్త్ డే పార్టీల‌కు త‌ర‌చూ వ‌స్తుంటారు. పండుగ‌ల‌కు కూడా మ‌హేష్, న‌మ్ర‌తా కుటుంబ స‌భ్యులు వెళుతుంటారు. న‌మ్ర‌తా, మ‌హేష్ త‌న స్నేహితుల‌తో క‌లిసి ఇంట్లోనే ఎంజాయ్ చేస్తుంటారు.  
 

మ‌హేష్ బాబు (Mahesh Babu)  ఇంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్ చూస్తే ఫారెన్ లుక్‌లో క‌నిపిస్తుంది.

మన దేశంలోనే ఓ అద్భుత‌మైన భ‌వ‌నంగా మ‌హేష్ బాబు ఇల్లును చెప్పుకోవచ్చు. రాజ‌కుమారుడు ఉండే ఇల్లంటే సాదాసీదాగా ఎలా ఉంటుంది. రాజ‌భ‌వ‌నంలానే ఉంటుంది.

Read More : ఫ్యామిలీతో రోడ్ ట్రిప్‌లో ప్రిన్స్ మహేష్ బాబు.. సెల్ఫీ వైరల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!