Sarkaru Vari Paata: 50 రోజులు పూర్తి చేసుకున్న స‌ర్కారు వారి పాట.. పండుగ చేసుకుంటున్న‌ మ‌హేష్ ఫ్యాన్స్‌

Updated on Jul 01, 2022 11:04 AM IST
మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట 50 రోజులు పూర్తి కావ‌డంతో ప్రిన్స్ (Mahesh Babu) అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. 
మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట 50 రోజులు పూర్తి కావ‌డంతో ప్రిన్స్ (Mahesh Babu) అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. 

Sarkaru Vari Paata: సూప‌ర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) న‌టించిన స‌ర్కారు వారి పాట మ‌రో రికార్డును సాధించింది. స‌ర్కారు వారి పాట  బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా పరశురామ్ పెట్ల ద‌ర్శ‌క‌త్వం అద్భుతంగా ఉందంటూ ప్రేక్ష‌కులు మెచ్చుకున్నారు. మ‌హేష్, కీర్తి సురేష్ ల‌వ్ ట్రాక్ కూడా బాగుంద‌ని ఆడియ‌న్స్ తీర్పు ఇచ్చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించారు. 

నెగెటివ్ టాక్‌తో హిట్ కొట్టింది
 'స‌ర్కారు వారి పాట ' మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మొద‌ట నెగిటివ్ టాక్ న‌డిచినా.. షో.. షోకు పాజిటివ్ టాక్ పెరిగిపోయింది.  'స‌ర్కారు వారి పాట ' అమెరికాలో కూడా దుమ్ము రేపింది. మొత్తం మీద ఈ చిత్రం బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించింది. 

మ్యూజిక్‌తో మ్యాజిక్
త‌మ‌న్ సంగీతం స‌ర్కారు వారి పాట‌కు మ‌రో ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే క‌ళావ‌తి పాట మిలియ‌న్ వ్యూస్ సాధించింది. మ‌.. మ‌. మ‌హేశా పాట అయితే మ‌రో రేంజ్‌లో హిట్ అయింది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అద్భుతంగా రాశారు. 

మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట 50 రోజులు పూర్తి కావ‌డంతో ప్రిన్స్ (Mahesh Babu) అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. 

ఎవ‌రు ఎలా న‌టించారంటే
మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌ట‌న‌ స‌ర్కారు వారి పాట‌కు హైలెట్‌గా నిలిచింది. కీర్తి సురేష్‌తో ల‌వ్ స్కీన్‌పైన అద‌రిపోయింది. కామెడీ స‌న్నివేశాల్లో కూడా మ‌హేష్ అద్భుతంగా న‌టించారు. అంతే కాదు మాస్ యాక్ష‌న్ సీన్స్‌, ఫైట్స్‌లో అద‌ర‌గొట్టారు. డైలాగులైతే థియేట‌ర్ల‌లో పేలాయి.

మ‌హాన‌టిగా మ‌హా అద్భుతంగా న‌టించిన‌ కీర్తి సురేష్ స‌ర్కారు వారి పాట సినిమాలో మ‌రో లెవెల్‌లో న‌టించారు. న‌ట‌న‌తో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి ఈ సినిమాలో క‌ళావ‌తి పాత్ర‌కు పూర్తి న్యాయం చేశారు. ఇప్పుడు కీర్తిని అంద‌రూ క‌ళావ‌తి అని పిలుస్తున్నార‌ట‌.

విల‌న్ రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖని త‌న న‌ట విశ్వ రూపం చూపారు. ఇక‌ వెన్నెల కిశోర్ త‌న‌దైన శైలిలో నవ్వులు పూయించారు. 

 

మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట 50 రోజులు పూర్తి కావ‌డంతో ప్రిన్స్ (Mahesh Babu) అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. 

వ‌సూళ్లు ఎంత‌?
'స‌ర్కారు వారి పాట ' (Sarkaru Vari Paata) ప్రీ రిలీజ్ బిజినెస్ విలువ రూ. 120 కోట్లు. అయితే విడుద‌ల త‌ర్వాత ఇండియాలో, అమెరికాలో మొద‌టి వారం ఈ చిత్రం బాగానే క‌లెక్ష‌న్ రాబ‌ట్టింది. రెండో వారంలో క‌లెక్ష‌న్ కాస్త త‌గ్గింది. ప‌లు సినిమాల రిలీజ్ కార‌ణంగా క‌లెక్ష‌న్ తగ్గింది.   'స‌ర్కారు వారి పాట ' సినిమా మ‌రో ఏడు కోట్ల రూపాయ‌లు వ‌సూళ్లు చేయాల్సి ఉంది. 

స్పెష‌ల్ పోస్ట‌ర్లు విడుద‌ల‌
స‌ర్కారు వారి పాట ప్ర‌పంచ వ్యాప్తంగా మే 12న విడుద‌లైంది. ఈ సినిమా దాదాపు 2 వేల‌కు పైగా ధియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తొలి రోజు నుంచి క‌లెక్ష‌న్ల ప‌రంగా మోత మోగించింది. అంతేకాకుండా అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్ల‌ను కొల్ల‌గొట్టింది. ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స్పెష‌ల్ పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసింది.  సమ్మర్ సెన్సెషనల్ బ్లాక్ బస్టర్ అనే టైటిల్‌తో స‌ర్కారు వారి పాట 50 రోజుల పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసింది. మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట 50 రోజులు పూర్తి కావ‌డంతో ప్రిన్స్ (Mahesh Babu) అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. 

Read More: బిల్‌గేట్స్‌తో మ‌హేష్ బాబు (Mahesh Babu) : ప్ర‌పంచ కుబేరుడిని క‌లిసిన టాలీవుడ్ శ్రీమంతుడు అంటున్న ఫ్యాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!