బిల్‌గేట్స్‌తో మ‌హేష్ బాబు (Mahesh Babu) : ప్ర‌పంచ కుబేరుడిని క‌లిసిన టాలీవుడ్ శ్రీమంతుడు అంటున్న ఫ్యాన్స్ !

Updated on Jun 29, 2022 04:16 PM IST
ప్ర‌పంచ కుబేరుడైన బిల్‌గేట్స్‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది : మ‌హేష్ బాబు (Mahesh Babu)
ప్ర‌పంచ కుబేరుడైన బిల్‌గేట్స్‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది : మ‌హేష్ బాబు (Mahesh Babu)

టాలీవుడ్ నటుడు మ‌హేష్ బాబు  (Mahesh Babu) ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడైన బిజినెస్‌మ్యాన్ బిల్‌గేట్స్‌ను క‌లిశారు.  త‌న భార్య స‌మ‌త్ర‌తో క‌లిసి బిల్‌గేట్స్‌ ఇంటిని సందర్శించారు. ఈ క్రమంలో ఆ దిగ్గజ వ్యాపారవేత్తతో దిగిన ఫోటోను మ‌హేష్ బాబు త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు అమెరికాలో తన హాలీడ్ ట్రిప్‌ను ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నారు. 

మ‌హేష్ బాబు  (Mahesh Babu) త‌న భార్య స‌మ‌త్ర‌, పిల్ల‌ల‌తో క‌లిసి ఇటీవలే అమెరికా వెళ్లారు. ఇదే క్రమంలో మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేతైన బిల్‌గేట్స్‌ను క‌లిశారు. ఆ చిత్రాలను తన అభిమానులతో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.  బిల్‌గేట్స్‌ (Bill Gates) ను క‌ల‌వ‌డంపై త‌న సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు మహేష్ బాబు. 

 

 
 
ప్ర‌పంచ కుబేరుడైన బిల్‌గేట్స్‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది. బిల్‌గేట్స్ ప్ర‌పంచంలోని మార్గ‌ద‌ర్శ‌కుల్లో ఒక‌రు. అత్యంత విన‌యంతో ఉండే బిల్‌గేట్స్ ఎంతో మందికి ప్రేర‌ణ‌గా నిలుస్తున్నారు. 
మ‌హేష్ బాబు
 

బిల్‌గేట్స్ ఇంటికి మ‌హేష్

స‌ర్కారు వారి పాట సినిమా మ‌హేష్ బాబు (Mahesh Babu) కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అందించింది. ప్రస్తుతం అందుకే మ‌హేష్ బాబు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే క్రమంలో తన హాలీడే ట్రిప్ కోసం విదేశాల‌కు వెళ్లారు.

ఇట‌లీ, యూర‌ప్ త‌ర్వాత మ‌హేష్ బాబు తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లారు. తన అమెరికన్ ట్రిప్‌లో భాగంగానే  బిల్‌గేట్స్ ఇంటిని సందర్శించారు. వాషింగ్టన్ మెడీనాలోని అత్యంత విలాసవంతమైన బిల్ గేట్స్ ఇంటికి మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్‌తో కలిసి వెళ్లారు. 

ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌తో మ‌హేష్ కాసేపు ముచ్చ‌టించారు.  ప్రపంచ కుబేరుడైన బిల్‌గేట్స్‌ను క‌ల‌వ‌డం ఎంతో ఆనందాన్ని క‌లిగించిందంటూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు. 

 

ప్ర‌పంచ కుబేరుడైన బిల్‌గేట్స్‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది :  మ‌హేష్ బాబు (Mahesh Babu)

సినిమాల‌తో బిజీ కానున్న మ‌హేష్
మ‌హేష్ బాబు విదేశాల నుంచి తిరిగి వ‌చ్చాక ప‌లు సినిమాల‌తో బిజీ కానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో SSMB28 చిత్రంలో హీరోగా నటించనున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మ‌హేష్ బాబుకు జోడిగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. మ‌రో రోల్‌లో మ‌హేష్ స‌ర‌స‌న  సంయుక్త మీనన్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి డైరెక్షన్‌లోనూ మ‌హేష్ బాబు (Mahesh Babu) ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఆఫ్రికన్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా దట్టమైన అడవులలో షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. 

Read More: Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంటిని మీరెప్పుడైనా చూశారా? నిజంగానే ఇది ఓ అద్భుత నిలయం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!