Mahesh Babu : త‌న భ‌ర్త మ‌హేష్‌కు 'సాటిరారు ఇంకెవ్వ‌రూ' అంటున్న న‌మ్ర‌తా (Namrata Shirodkar)

Updated on Jul 31, 2022 07:31 PM IST
మ‌హేష్ (Mahesh Babu) త‌న‌కు హ‌గ్ ఇచ్చిన‌ ఫోటోను న‌మ్ర‌తా త‌న ఇన్ స్టాలో షేర్ చేశారు. 'సాటిరారు.. నీకెవ్వ‌రూ' అంటూ కామెంట్ కూడా పెట్టారు.
మ‌హేష్ (Mahesh Babu) త‌న‌కు హ‌గ్ ఇచ్చిన‌ ఫోటోను న‌మ్ర‌తా త‌న ఇన్ స్టాలో షేర్ చేశారు. 'సాటిరారు.. నీకెవ్వ‌రూ' అంటూ కామెంట్ కూడా పెట్టారు.

టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) బ్లాక్ బాస్ట‌ర్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తున్నారు. మ‌హేష్ బాబు సినిమాల‌ను ఎంత ఇష్ట‌ప‌డ‌తారో కుటుంబాన్ని అంతే ప్రేమిస్తారు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా భార్య, పిల్ల‌ల‌తో మ‌హేష్ బాబు స‌ర‌దాగా విదేశాల‌కు వెళుతుంటారు.  ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు, న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

క్యూట్ ఫోటో షేర్ చేసిన న‌మ్ర‌తా

మ‌హేష్ బాబు (Mahesh Babu) తో దిగిన ఫోటోను న‌మ్ర‌తా శిరోద్క‌ర్ త‌న ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. కుమారుడు గౌత‌మ్ చ‌దువు కోసం మ‌హేష్ బాబు త‌న కుటుంబంతో లండ‌న్ వెళ్లారు. అక్క‌డి నుంచి స్విజ‌ర్తాండ్‌లో లాండ్ అయ్యారు. మ‌హేష్ బాబు త‌న‌కు హ‌గ్ ఇచ్చిన‌ ఫోటోను న‌మ్ర‌తా త‌న ఇన్ స్టాలో షేర్ చేశారు. 'సాటిరారు.. నీకెవ్వ‌రూ' అంటూ కామెంట్ కూడా పెట్టారు. వీరిద్ద‌రి అన్యోన బంధం చూసి మ‌హేష్ అభిమానులు ఆనంద ప‌డుతున్నారు. సూప‌ర్ పిక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మ‌హేష్ బాబుతో పెళ్లి త‌ర్వాత న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సినిమాల‌కు దూరంగా ఉన్నారు. పిల్ల‌ల బాధ్య‌త‌ను న‌మ్ర‌తా తీసుకున్నారు. మ‌హేష్ బాబుకు మేనేజ‌ర్ కూడా న‌మ్ర‌తానే. మ‌హేష్‌కు సంబంధించిన సినిమా, బిజినెస్ విష‌యాల‌ను మాజీ మిస్ ఇండియానే చూసుకుంటారు. 

ఆగ‌స్టు నుంచి మ‌హేష్ షూటింగ్
మ‌హేష్ (Mahesh Babu) లండ‌న్ నుంచి తిరిగి వ‌చ్చాక సినిమా షూటింగ్‌ల‌లో బిజీ కానున్నారు. ఆగస్టు నెలలో మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. మ‌హేష్ బాబు పుట్టిన రోజు ఆగ‌స్టు 9. మ‌హేష్ బాబు పుట్టిన రోజు త్రివిక్ర‌మ్ 'SSMB28' సినిమా నుంచి అప్‌డేట్ ఇస్తార‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

Read More: ‘SSMB28’: మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో మూవీ.. ఫస్ట్ లుక్ కోసం ముహూర్తం ఖరారు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!