ఆర్‌‌సీ15 మూవీ పిక్స్ లీక్.. షాక్‌లో మెగాపవర్‌‌ స్టార్ రాంచరణ్ (RamCharan), డైరెక్టర్ శంకర్‌‌

Updated on Oct 13, 2022 12:28 PM IST
మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ వంటి సూపర్‌‌హిట్ తర్వాత మెగాపవర్‌‌ స్టార్ రాంచరణ్‌ (RamCharan).. శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆర్‌‌సీ15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమా గురించిన అప్‌డేట్స్‌ కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక, డైరెక్టర్‌‌ శంకర్‌‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆర్‌‌సీ15 సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ తదుపరి షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఆర్‌‌సీ15 సినిమాను దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ ఎస్‌జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు.

తన సినిమాల్లోని క్యారెక్టర్లు, గెటప్స్, కథ అన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు దర్శకుడు శంకర్. దాని కోసం షూటింగ్‌ జరిగే ప్రదేశంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటారాయన. అయితే ఆర్‌‌సీ15 సినిమా విషయంలో రాంచరణ్‌, శంకర్‌‌కు గట్టి షాక్ తగిలింది. ఆ సినిమాకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ సినిమాలో ఎవరి క్యారెక్టర్ ఏంటి అనే విషయం ప్రేక్షకులకు తెలిసిపోయింది.

మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (RamCharan) శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరోసారి లీక్...

ఇప్పటికే ఆర్‌‌సీ15 సినిమా నుంచి చరణ్ సైకిల్ తొక్కే స్టిల్స్‌ లీకైన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు మరికొన్ని ఫోటోలు లీకయ్యాయి. ఈ ఫోటోల్లో పల్లెటూరి వ్యక్తిగా రాంచరణ్‌ కనిపిస్తున్నారు. అంతేకాదు భారతీయుడు సినిమాలో వృద్ధుడి గెటప్‌లో ఉన్న కమల్‌హాసన్‌ను గుర్తు చేసేలా చరణ్‌ ఫోటోలు ఉన్నాయి. అంతేకాదు, మరో ఫోటోలో చరణ్ పక్కన అంజలి, ఒక బాబు కూడా ఉన్నారు. ఈ ఫోటోల ప్రకారం చరణ్‌కు అంజలి భార్యగా నటించినట్టు తెలుస్తోంది. ఇక పక్కన ఉన్న బాబు యంగ్ రాంచరణ్‌ అనేట్టుగా ఉన్నాయి ఆ ఫోటోలు.

అసలే ఫోటోలు లీకైన షాక్‌లో ఉన్న చిత్ర యూనిట్‌కు మరో తలనొప్పి కూడా ఎక్కువైంది. ఈ ఫోటోలు లీక్ కావడంతో సినిమా కథ గురించిన  ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. యంగ్ రాంచరణ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌‌ అవుతారని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే ఆర్‌‌సీ15 సినిమా కథ అనే ప్రచారం జోరుగా ఉంది. మరో హీరోయిన్ కియారా అద్వానీకి, రాంచరణ్‌ (RamCharan)కు మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా, మెచ్యూర్డ్‌గా ఉంటాయని టాక్.  

Read More : సల్మాన్‌ఖాన్ (Salman Khan) సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసిన మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!