జూనియర్ ఎన్టీఆర్‌‌ (Junior NTR) పై దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సంచలన కామెంట్స్‌

Updated on Nov 16, 2022 05:31 PM IST
తెలుగు సినిమా ఖ్యాతిని  ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli). బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ రికార్డులు సృష్టించాయి
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli). బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ రికార్డులు సృష్టించాయి

దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించే ఒక్కో సినిమా ఒక్కో రికార్డును సృష్టిస్తోంది. ఇటీవల జక్కన్న తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) తమ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. భారతదేశంతోపాటు విదేశాల్లో కూడా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది.

ఇటీవల చికాగోలో జరిగిన ఒక కార్యక్రమంలో  జూనియర్ ఎన్టీఆర్‌ గురించి దర్శకుడు రాజమౌళి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎన్టీఆర్‌కు పనిపై ఉన్న నిబద్ధత, డాన్స్‌పై ఉన్న తపన గురించి ఆయన మాట్లాడారు. తారక్‌ను చూసి తానెప్పుడూ ఆశ్చర్యపోతుంటానని తెలిపారు.

12 గంటల షూటింగ్ తర్వాత కూడా..

‘తారక్‌ అద్భుతమైన డాన్సర్‌. ఎక్కువ సాధన చేయాల్సిన అవసరం లేదు. అయినా, ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో ఎంతో కష్టపడ్డాడు. 12 గంటలు నిరంతరంగా షూటింగ్‌ చేశాక కూడా మళ్లీ రూమ్‌కు వెళ్లి మరుసటి రోజు షెడ్యూల్‌ కోసం గంటల తరబడి సాధన చేసేవాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా గౌరవం ఉంది’ అంటూ తారక్‌పై అభిమానాన్ని వెల్లడించారు రాజమౌళి.

ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని, తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ రాసే పనిలో ఉన్నారని రాజమౌళి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను అభిమానించిన వారిలో జోష్‌ నింపింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR). ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా NTR30 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనుంది.

Read More : Mahesh Babu: తీవ్ర విషాదంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయి..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!