సల్మాన్‌ఖాన్ (Salman Khan) సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసిన మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ (RamCharan)

Updated on Oct 06, 2022 11:53 PM IST
మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ (Ram Charan) ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత శంకర్‌‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు
మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ (Ram Charan) ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత శంకర్‌‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు

చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగాపవర్‌‌స్టార్‌‌గా ఎదిగారు రాంచరణ్ ( RamCharan). టాలీవుడ్‌లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు చరణ్. ఇక, రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది. డాన్స్, ఫైట్స్, డైలాగ్స్‌తో యూత్‌ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు చెర్రీ. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత శంకర్‌‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆర్‌‌సీ15 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇక, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. కరోనా తర్వాత భారీ హిట్‌ కోసం బాలీవుడ్ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన టీజర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పక్కా యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ లోగోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ (Ram Charan) ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత శంకర్‌‌ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు

కాస్ట్యూమ్‌తో సెట్‌కు..

‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో సల్మాన్‌ఖాన్‌తోపాటు టాలీవుడ్‌ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డే, జగపతిబాబు, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయాల్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఈ విషయాన్ని సల్మాన్‌ఖాన్‌ తెలిపారు. చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్‌‌ సినిమా హిందీలో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలోని కీలకపాత్రలో సల్మాన్‌ఖాన్‌ నటించారు. గాడ్‌ఫాదర్ హిందీ ట్రైలర్‌‌ను ఇటీవల ముంబైలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, సల్మాన్‌ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా గురించి సల్మాన్‌ఖాన్‌ మాట్లాడారు.

‘మేము హైదరాబాద్‌లో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలో వెంకటేష్‌ నాతోపాటు ఉన్నారు.  అదే సమయంలో నన్ను కలవడానికి రాంచరణ్ వచ్చారు. ఈ సినిమాలో నేను  కూడా నటించాలనుకుంటున్నాను అని నాతో చెప్పారు. నాతో, వెంకీతో కలిసి ఒకే ఫ్రేమ్‌ పంచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఏదో సరదాగా అంటున్నారని అనుకుని  ఆ విషయం గురించి రేపు మాట్లాడుకుందాం అని చెప్పాను. తర్వాత రోజు కాస్ట్యూమ్‌తోపాటు సెట్‌కు మాకంటే ముందుగానే వచ్చారు. అలా ఇద్దరూ కలిసి ఆ సమయంలో అతను తమాషా చేస్తున్నాడని నేను అనుకున్నాను. దాని గురించి రేపు మాట్లాడుకుందాం అని చెప్పాను. మరుసటి రోజు తన కాస్ట్యూమ్‌తో సహా మా కంటే ముందే సెట్‌కి రాంచరణ్‌ (RamCharan) వచ్చేశారు. అలా మేమిద్దరం కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాకు పనిచేశాం’ అని చెప్పుకొచ్చారు సల్మాన్‌ఖాన్.

‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాను సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్మాన్ ఖాన్‌ ( Salman Khan) స్వయంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాను 2022 చివరికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Read More : రాంచరణ్‌ (RamCharan) క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘ఆర్‌‌సీ15’ సినిమా నాన్‌ థియేట్రికల్ హక్కులకు అన్ని కోట్లా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!