NTR: ఎన్టీఆర్ వ‌ద్ద‌నుకున్న‌ సినిమా గోపీచంద్ (Gopichand) చేస్తున్నారా?.. నిజ‌మేనా ?

Updated on Jul 02, 2022 03:28 PM IST
Gopichand: గోపీచంద్ నెక్ట్స్ సినిమా ఎవ‌రి డైరెక్ష‌న్‌లో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.
Gopichand: గోపీచంద్ నెక్ట్స్ సినిమా ఎవ‌రి డైరెక్ష‌న్‌లో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) న‌టించిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా రిలీజ్ అయింది. 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' మూవీ పాజిటీవ్ టాక్‌తో గోపీచంద్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధిస్తుంద‌ని గోపీచంద్ భావిస్తున్నారు. గోపీచంద్ తదుపరి సినిమా ఎవ‌రి డైరెక్ష‌న్‌లో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. గోపీచంద్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలో గోపీచంద్ న‌టిస్తున్నారంటూ ప్ర‌చారం జోరుగా సాగుతుంది.

గోపీచంద్ (Gopichand) 29వ సినిమా 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌'. ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కామెడీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' చిత్రాన్ని మారుతి తెర‌కెక్కించారు. గోపీచంద్‌కు జోడిగా ఈ సినిమాలో రాశీ ఖ‌న్నా న‌టించారు. ఈ చిత్రంలో గోపీచంద్ న్యాయవాది పాత్ర‌లో వెండితెర‌పై క‌నువిందు చేశారు. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై  అల్లు అరవింద్‌, బన్నీ వాసులు ఈ సినిమాను నిర్మించారు. 

Gopichand: గోపీచంద్ నెక్ట్స్ సినిమా ఎవ‌రి డైరెక్ష‌న్‌లో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

లౌక్యం ద‌ర్శ‌కుడితో సినిమా
శ్రీవాస్ డైరెక్ష‌న్‌లో గోపీచంద్ 'లౌక్యం' సినిమాలో న‌టించారు. లౌక్యం సినిమా గోపీచంద్‌కు మంచి హిట్ ఇచ్చింది. ప్ర‌స్తుతం గోపీచంద్ శ్రీవాస్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న మ‌రో మూవీలో న‌టిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ (NTR) రిజెక్ట్ చేసిన సినిమాలో గోపీచంద్ న‌టిస్తున్నార‌నే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి  తమిళ దర్శకుడు హరి ఎన్టీఆర్‌కు ఓ క‌థ‌ను చెప్పారట‌. ఎన్టీఆర్ ప‌లు సినిమాల్లో బిజీగా ఉండ‌టంతో హ‌రి చెప్పిన క‌థ‌ను ఓకే చేయ‌లేద‌ట‌. హ‌రి ఆ సినిమా క‌థ‌నే గోపీచంద్‌కు వినిపించార‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో గోపీచంద్ హ‌రి చెప్పిన సినిమాను ఓకే చేశార‌ట‌. ఈ సినిమాకు భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని టాక్.

త‌మిళ ద‌ర్శ‌కుడితో గోపీచంద్
త‌మిళ ద‌ర్శ‌కుడు హ‌రి హీరో విక్ర‌మ్‌తో 'సామి' సినిమాను తెరకెక్కించారు. సూర్య‌తో 'సింగం' మొదలైన సినిమాలను రూపొందించారు. అయితే హ‌రి కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ గోపీచంద్ సినిమాతో తెలుగులో త‌న స‌త్తా చాట‌నున్నారు హ‌రి. అయితే గోపీచంద్ (Gopichand), హ‌రి కాంబో సినిమాపై అధికార‌క ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. 

Read More :Pakka Commercial (పక్కా కమర్షియల్ రివ్యూ) : హీరో గోపీచంద్ కోసమే ఈ సినిమా చూడాలి.. అయినా ఏం మిస్ అయ్యిందంటే ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!