Pakka Commercial (పక్కా కమర్షియల్ రివ్యూ) : హీరో గోపీచంద్ కోసమే ఈ సినిమా చూడాలి.. అయినా ఏం మిస్ అయ్యిందంటే ?

Updated on Jul 01, 2022 03:46 PM IST
గోపీచంద్ (Gopichand) సిటీమార్ త‌ర్వాత 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 
గోపీచంద్ (Gopichand) సిటీమార్ త‌ర్వాత 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

సినిమా - ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్

నటీనటులు - గోపిచంద్, రాశీ ఖ‌న్నా, స‌త్య‌రాజ్, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్

ద‌ర్శ‌కుడు - మారుతి

నిర్మాతలు - అల్లు అరవింద్‌, బన్నీ వాసు

బ్యాన‌ర్ - గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్‌

సంగీతం - జేక్స్ బిజోయ్ 

రేటింగ్ - 3/5

Pakka Commercial :మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) 29వ సినిమా 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్'  ఈ రోజే రిలీజ్ అయింది. 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమాను ద‌ర్శ‌కుడు మారుతి కామెడీ, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కించారు. గోపీచంద్‌కు జోడిగా ఈ సినిమాలో రాశీ ఖ‌న్నా న‌టించారు.  ఇదే చిత్రంలో గోపీచంద్ న్యాయవాది పాత్ర‌లో వెండితెర‌పై క‌నువిందు చేశారు.ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. 

సినిమా క‌థ ఎలా సాగింది

రాంచంద్ (గోపీచంద్)  ఓ లాయ‌ర్. అలాగని మామూలు లాయర్ కాదు..  ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లాయ‌ర్. తన వద్దకొచ్చే కేసులకు  సంబంధించి ప్ర‌తీ విష‌యాన్ని  డ‌బ్బుతో ముడిపెడుతుంటాడు. రాంచంద్ తండ్రి (స‌త్య‌రాజ్‌) ఓ న్యాయమూర్తి. ఎన్నో కేసుల‌ను టేక‌ప్ చేసినా కూడా, జ‌డ్జిగా మంచి పేరు తెచ్చుకుంటాడు.

రాంచంద్‌కు, అత‌ని తండ్రికి గుణగణాల విషయంలో ఏ మాత్రం పోలికే ఉండ‌దు. కొడుకు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వ్య‌క్తి అయితే.. తండ్రి నిజాయతీపరుడైన న్యాయమూర్తి. దీంతో ఆ తండ్రీ కొడుకుల మ‌ధ్య చిన్నపాటి విభేదాలు మొదలవుతాయి. ఇదే క్రమంలో సీరియ‌ల్ యాక్ట‌ర్‌ ఝాన్నీ (రాశీ ఖ‌న్నా) కి అనుకోని ఆఫర్ వస్తుంది. అదేంటంటే.. తను లాయ‌ర్ పాత్ర‌లో న‌టించాల్సి రావడం.

అందుకోసం ఆమె రాంచంద్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా జాయిన్ అవుతుంది. రాంచంద్, ఝాన్నీ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. అనుకోని సందర్భంలో ఓ  మిస్టరీ కేసు విషయంలో, రాంచంద్‌కు తన తండ్రితోనే సవాల్ ఎదురవుతుంది. మరి ఈ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఏ ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంది?  తండ్రీ, కొడుకుల్లో ఎవ‌రు గెలిచారో తెలుసుకోవాలంటే థియేట‌ర్‌కు వెళ్లి 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా చూడాల్సిందే. 

లాయ‌ర్‌గా గోపీచంద్  (Gopichand) ఎలా న‌టించారు?

గోపీచంద్ లాయ‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయారు. క‌మ‌ర్షియ‌ల్‌గా ఆలోచించే వ్య‌క్తి మాదిరిగానే గోపీచంద్ తన పాత్రలో జీవించి ప్రేక్ష‌కులను మెప్పించారు. గోపీచంద్ హీరోగానే కాకుండా, విల‌న్ పాత్ర‌ల్లో కూడా న‌టించిన అనుభ‌వం ఈ సినిమాకు ప్ల‌స్ అయింది. పాజిటివ్, నెగిటివ్ షేడ్‌ల‌ను ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలిసిన న‌టుడు గోపిచంద్.

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌గా ఆలోచించే లాయ‌ర్ పాత్ర‌లో గోపీచంద్ తనదైన శైలిలో అద‌ర‌గొట్టారు. గోపీచంద్ లుక్ కూడా ఈ సినిమాకు ప్ల‌స్ అయింది.  కథానాయకుడిగా గోపిచంద్ తన డైలాగులు, ఫైట్స్‌తో పాటు కామెడీని కూడా అదే స్థాయిలో పండించారు. 

రాశీ ఖ‌న్నా యాక్టింగ్

'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమాకు ముందుగా సాయి ప‌ల్ల‌విని కథానాయికగా అనుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల‌తో 'ఆక్సిజ‌న్‌'లో గోపీచంద్‌కు జోడిగా న‌టించిన రాశీ ఖ‌న్నాను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. రాశీ ఖ‌న్నా ఈ చిత్రంలో సీరియల్ కథానాయికగా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. కామెడీ సీన్స్‌లో కూడా రాశి తన మార్కు నటనను కనబరిచి ప్రేక్షకులను అలరించారు. 

డైరెక్ట‌న్ ఎలా సాగింది

మారుతీకి కూడా డైరెక్టర్‌గా ఈ సినిమాలో మంచి మార్కులే పడ్డాయి. యాక్ష‌న్ సీన్స్‌లో కూడా కామెడీని మిక్స్ చేస్తూ, క‌థను నడిపించిన తీరు బాగుంది. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ ల‌వ్ ట్రాక్‌ సీన్లను కూడా దర్శకుడు బాగానే రాసుకున్నారు.

ముఖ్యంగా గోపీచంద్‌ను కొత్తగా చూపించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. అయితే ద్వితీయార్థంలో కథ వేగంగా ముందుకు కదలకపోవడం ఒక్కటే చిత్రానికి మైనస్. అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి అనవసరమే అని అనిపిస్తుంది. అవి కథకు అడ్డంగా కూడా మారాయి. 

మిగ‌తా వారి న‌ట‌న సంగ‌తి

స‌త్య‌రాజ్ న‌ట‌న‌లోనే ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. అందుకే ఈ చిత్రంలో కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే అలరించారు.  కామెడీ, యాక్ష‌న్, సెంటిమెంట్ సీన్లలో స‌త్య‌రాజ్ నటన, భావోద్వేగాలను పండించిన తీరు ప్రశంసనీయం. అలాగే సప్తగిరి కామెడీ కూడా బాగుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు . ఇక రావు రమేష్, అనసూయ భరధ్వాజ్ కూడా తమ పాత్రలకు న్యాయమే చేశారు. . 

టెక్నిక‌ల్ టీమ్

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు.  జేక్స్ బిజోయ్ సంగీతం స‌మ‌కూర్చారు. 'పక్కా కమర్షియల్' అంటూ సాగే పాటను దివంగత రచయిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాశారు. ఎడిట‌ర్‌గా ఎస్‌బీ ఉద్ధ‌వ్ వ్య‌వ‌హ‌రించారు.

 

 

గోపీచంద్ (Gopichand) సిటీమార్ త‌ర్వాత ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

టికెట్ రేటు

తెలంగాణ‌ థియేట‌ర్లలో టిక్కెట్ ధర రూ.100 అయితే.. మ‌ల్టీప్లెక్స్‌లలో రూ.160 వ‌సూళ్లు చేస్తున్నారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో థియేట‌ర్లలో అయితే రూ. 100 ను..  అదే మ‌ల్టీప్లెక్స్‌లో రూ.150 గా టికెట్ ధ‌రను నిర్ణ‌యించారు. 

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే

'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా విడుద‌ల‌కు ముందే వ‌సూళ్ల ప‌రంగా దూసుకెళ్లింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 19.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాపీస్ దగ్గర రూ. 20 కోట్లు వ‌సూళ్లు చేయాల్సి ఉంది.

లేటుగా రిలీజ్

'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే క‌రోనా కార‌ణంగా, పాన్ ఇండియా సినిమాల వ‌ల్ల లేట్‌గా రిలీజ్ చేశారు. గోపిచంద్ (Gopichand) న‌టించిన 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా జూలై 1న ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చింది.

ఓటీటీ హ‌క్కులు

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్‌తో పాటు, తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా సంయుక్తంగా దక్కించుకున్నాయి. సినిమా విడుద‌లైన ఐదు వారాల‌కు 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. 

ద‌ర్శ‌కుడు మారుతీ డైరెక్ట‌న్‌లో విడుద‌లైన ప‌ద‌వ సినిమా 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్'. గోపీచంద్  (Gopichand) 'సిటీమార్' త‌ర్వాత.. 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్' సినిమాతో  బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్ల‌స్ పాయింట్స్

గోపీచంద్ న‌ట‌న‌

కామెడీ

డైరెక్ష‌న్‌

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ద్వితీయార్థం

Read More: మీతో సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరో కాదురా.. విలన్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!