విదేశాలకు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu)? హెల్త్ చెకప్ కోసమంటూ వార్తలు.. ఆందోళనలో ఫ్యాన్స్!

Updated on Oct 15, 2022 03:42 PM IST
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

సూపర్‌‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రతి సంవత్సరం సుమారు రెండుసార్లు విదేశాలకు వెళుతుంటారు. సినిమా షూటింగ్‌కు ముందు తర్వాత ఆయన ఫ్యామిలీలో వెకేషన్‌కు వెళతారు. అయితే ఈ సారి మహేష్‌ ఫ్యామిలీతో కాకుండా ఒక్కరే ఫారిన్ వెళ్లనున్నట్టు సమాచారం. దీంతో ఆయన ఒక్కరే విదేశాలకు వెళ్లడానికి కారణం ఏమిటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అయోధ్యలో అర్జునుడు’ టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయ్యింది. రెండో షెడ్యూల్‌ దసరా తర్వాత మొదలవుతుందని అందరూ అనుకున్నారు. అయితే మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఎస్‌ఎస్‌ఎంబీ28 సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ కొంత ఆలస్యమైంది. అక్టోబర్‌‌ మూడో వారం నుంచి రెగ్యులర్‌‌ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

మెడికల్ కన్సల్టింగ్‌ కోసం..

మహేష్‌బాబు ఈసారి సింగిల్‌గా ఫారిన్ వెళ్లేది ఎందుకు అనే దానిపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెడికల్ కన్సల్టింగ్ కోసం మహేష్‌ విదేశాలకు వెళ్లనున్నారని టాక్. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందని ఆరా తీస్తున్నారు. అయితే ఈ వార్తలపై క్లారిటీ లేదు. మహేష్‌బాబు ఫారిన్ నుంచి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.

కాగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాలో మహేష్‌ లుక్స్ కొత్తగా ఉంటాయని, కెరీర్‌‌లో ఇప్పటివరకు చేయని మాస్‌ క్యారెక్టర్‌‌లో ఆయన కనిపించి అభిమానులను అలరించనున్నారని సమాచారం. ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా తర్వాత మహేష్‌ (MaheshBabu).. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్నారు.  

Read More : మహేష్‌బాబు (MaheshBabu) ‘ఖలేజా’కు పన్నెండేళ్లు.. డిఫరెంట్ మేనరిజంతో ప్రేక్షకులను అలరించిన సూపర్‌‌స్టార్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!