సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)!

Updated on Oct 07, 2022 12:06 AM IST
పూజా హెగ్డే (Pooja Hegde) చేసిన సినిమాలు రెండు మూడు వరుసగా ఫ్లాప్ కావడంతో మహేష్‌బాబు (MaheshBabu)– త్రివిక్రమ్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు
పూజా హెగ్డే (Pooja Hegde) చేసిన సినిమాలు రెండు మూడు వరుసగా ఫ్లాప్ కావడంతో మహేష్‌బాబు (MaheshBabu)– త్రివిక్రమ్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. రెండో షెడ్యూల్‌ దసరా తరువాత మొదలవుతుందని అందరూ అనుకున్నారు. అయితే మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవలే మరణించారు. దీంతో సూపర్‌‌స్టార్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రెండో షెడ్యూల్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆరంభం అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. త్వరలో మొదలుకానున్న సెకండ్ షెడ్యూల్‌లో హీరోహీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

పూజా హెగ్డే (Pooja Hegde) చేసిన సినిమాలు రెండు మూడు వరుసగా ఫ్లాప్ కావడంతో మహేష్‌బాబు (MaheshBabu)– త్రివిక్రమ్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు

మరోసారి హిట్‌ కోసం..

‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు పూజా హెగ్డే. కెరీర్‌‌ స్టార్టింగ్‌లో హిట్ కోసం తంటాలుపడిన బుట్టబొమ్మ.. తర్వాత టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. వరుసగా అవకాశాలను అందుకుంటూ స్టార్‌‌ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌ అయ్యారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అదే జోష్‌తో హిందీలో కూడా సినిమాలు చేస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు.

కాగా, కొంత కాలంగా పూజాకు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తోందనే చెప్పాలి. ఆమె నటించిన రెండు, మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. దాంతో పూజా హెగ్డే ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమా తనకు మంచిపేరు తెచ్చిపెట్టిందని ఇటీవల బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు పూజ.

మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా తనకు ఎంతో కీలకమని అన్నారు. ఈ సినిమాతో తప్పకుండా కమ్‌బ్యాక్ ఇస్తానని చెప్పుకొచ్చారు బుట్టబొమ్మ. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. 

Read More : మహేష్‌బాబు (MaheshBabu) ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ మ్యూజిక్ కోసం థమన్ (SS Thaman) రెమ్యునరేషన్ అన్ని కోట్లా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!