మహేష్‌బాబు (MaheshBabu) ‘ఖలేజా’కు పన్నెండేళ్లు.. డిఫరెంట్ మేనరిజంతో ప్రేక్షకులను అలరించిన సూపర్‌‌స్టార్

Updated on Oct 08, 2022 10:30 PM IST
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా తర్వాత మూడో సినిమాగా ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ తెరకెక్కుతోంది.
సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా తర్వాత మూడో సినిమాగా ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ తెరకెక్కుతోంది.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో సినిమా ఖలేజా. భారీ అంచనాల మధ్య 2010, అక్టోబర్‌‌ 7వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఖలేజా సినిమా థియేటర్లలో సందడి చేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సినిమా గురించిన ఆసక్తికర విషయాలు పింక్‌విల్లా ప్రేక్షకుల కోసం ప్రత్యేకం.

సూపర్‌‌స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లోకి వచ్చిన మహేష్‌బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించారు. రాజకుమారుడు సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగారు. తన లుక్స్, నటనతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు మహేష్.

మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్‌మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, మహర్షి,  సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ సినిమాలతో సూపర్‌‌స్టార్‌‌ అయ్యారు. ఇప్పటివరకు హీరోగా 27 సినిమాల్లో నటించిన మహేష్‌బాబు ఉత్తమ నటుడిగా నాలుగుసార్లు నంది అవార్డులు అందుకున్నారు.

మహేష్‌ సినీ కెరీర్‌‌లోని పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయాయి. అయితే ఆ సినిమాల్లోని నటనకుగాను మహేష్‌బాబు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అటువంటి సినిమాల్లో ఖలేజా కూడా ఒకటి. ఖలేజా సినిమాలో మహేష్‌బాబు సరసన అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, రావు రమేష్, షఫీ, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, అలీ కీలకపాత్రలు పోషించారు.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా తర్వాత మూడో సినిమాగా ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ తెరకెక్కుతోంది.

మహేష్‌ మేనరిజం..

అప్పటివరకు మహేష్‌బాబు సైలెంట్‌గా డైలాగులు చెప్పడమే చూశారు అభిమానులు. ఖలేజా సినిమాలో పంచ్‌ డైలాగులు, డిఫరెంట్ మేనరిజంతో కనిపించారు ప్రిన్స్. ఆ మేనరిజం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

డిఫరెంట్ కాన్సెప్ట్..

ఖలేజా సినిమాను విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). మనిషి రూపంలోనే దేవుడు ఉంటాడు అనే కథాంశంతో సినిమా మొత్తాన్ని నడిపించారు త్రివిక్రమ్. కష్టాల్లో ఉన్న మనిషికి సహాయం చేసే ప్రతి మనిషి దేవుడేనని సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు.

మంచి సంగీతం..

ఖలేజా సినిమాలోని అన్ని పాటలు శ్రోతలను బాగానే ఆకట్టుకున్నాయి. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘సదాశివ సన్యాసి’ పాట మహేష్‌ కెరీర్‌‌లోని ఆల్‌టైమ్ హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామగజోగయ్య శాస్త్రి ఖలేజా సినిమాలోని పాటలకు లిరిక్స్ అందించారు.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా తర్వాత మూడో సినిమాగా ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ తెరకెక్కుతోంది.

బుల్లితెరపై మాత్రం..

మహేష్‌బాబు మేనరిజం, డైలాగులను ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేసినా.. ఎందుకో ఖలేజా సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లు సాధించలేదు. అయితే బుల్లితెరపై మాత్రం ఖలేజా సినిమా ఇప్పటికీ మంచి టీఆర్పీతో దూసుకెళుతోంది.

అవార్డులు..

మహేష్‌ (MaheshBabu) ఖలేజా సినిమాలోని ‘సదాశివ సన్యాసి’ పాటకు లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రికి బెస్ట్ లిరిసిస్ట్‌గా సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌‌ అవార్డు దక్కింది. ఈ పాట పాడిన రమేష్‌ వినాయగం, ఎన్‌సీ కారుణ్యకు బెస్ట్‌ మేల్‌ ప్లే బ్యాక్ సింగర్‌‌ అవార్డు లభించింది.  అంతేకాదు ఖలేజా సినిమాలోని నటనకుగాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌‌గా షపీ నామినేట్‌ అయ్యారు.

Read More : మహేష్‌బాబు (MaheshBabu)తో తెరకెక్కించే సినిమా నా కెరీర్‌‌లోనే పెద్దది.. ఎస్‌ఎస్‌ఎంబీ29పై రాజమౌళి కామెంట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!