త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్‌లో మహేష్‌బాబు (MaheshBabu)!.. మరింత స్టైలిష్‌గా సూపర్‌‌స్టార్

Updated on Oct 15, 2022 04:06 PM IST
సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్‌బాబు (MaheshBabu) త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అనంతరం రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది
సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్‌బాబు (MaheshBabu) త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అనంతరం రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది

సర్కారు వారి పాట సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu). మహర్షి, సరిలేరు నీకెవ్వరు సక్సెస్‌లు ఇచ్చిన జోష్‌తో సర్కారు వారి పాట సినిమాలో నటించారు ప్రిన్స్. ఈ సినిమా కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక, మహేష్‌ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.

మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో  ఎస్‌ఎస్‌ఎంబీ28పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు అభిమానలను విపరీతంగా అలరించాయి. ఎస్‌ఎస్‌ఎంబీ28 ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా.. మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి అకాల మరణంతో షూటింగ్ వాయిదా పడింది. అక్టోబర్‌‌ 10 నుంచి మొదలవుతుందని అనుకున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సెకండ్ షెడ్యూల్ షూటింగ్ అక్టోబర్ మూడో వారానికి వాయిదా పడిందని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్‌బాబు (MaheshBabu) త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అనంతరం రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది

వైరలవుతున్న ఫోటో..

ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాలో మహేష్‌బాబు ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించనంత స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారని టాక్. అదే విధంగా.. కెరీర్‌‌ ఎప్పుడూ చేయని మాస్ క్యారెక్టర్‌‌తో అభిమానులను అలరించనున్నారని తెలుస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించనున్నట్టు సమాచారం. ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమలో మహేష్‌బాబు లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సోషల్‌ మీడియాలో తాజాగా విడుదలైన ఫోటోలో కొత్త హెయిర్‌‌ స్టైల్‌లో మహేష్‌ అట్రాక్టివ్‌గా ఉన్నారు. ప్రముఖ హెయిర్‌‌ స్టైలిస్ట్‌ అలీమ్ హకీమ్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) ‘ఖలేజా’కు పన్నెండేళ్లు.. డిఫరెంట్ మేనరిజంతో ప్రేక్షకులను అలరించిన సూపర్‌‌స్టార్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!