మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ‘అయోధ్యలో అర్జునుడు’? పరిశీలిస్తున్న చిత్ర యూనిట్

Updated on Sep 27, 2022 11:11 AM IST
మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యిందని చిత్ర యూనిట్ ప్రకటించింది
మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యిందని చిత్ర యూనిట్ ప్రకటించింది

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం హ్యాట్రిక్‌ హిట్‌పై కన్నేశారు. సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలు హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్. పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మహేష్‌బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూశారు. వాళ్ల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు మహేష్‌బాబు.

మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యిందని చిత్ర యూనిట్ ప్రకటించింది

టైటిల్‌పై ఆసక్తికర చర్చ..

ఎస్‌ఎస్‌ఎంబీ28ను ప్రకటించినప్పటి నుంచి సినిమా కథ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించిన అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్‌పై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబీ28 మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. దసరా పండుగ తర్వాత సెకండ్ షెడ్యూల్‌ మొదలుకానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో మహేష్‌బాబు – పూజా హెగ్డేల కాంబినేషన్‌లో సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాల టైటిల్స్‌ ‘అ’ అనే అక్షరంతో స్టార్ట్ కావడం సెంటిమెంట్‌గా ఉంది. అ..ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమా టైటిల్స్ అ అక్షరంతో మొదలై.. సూపర్‌‌హిట్ అయ్యాయి. ఎస్‌ఎస్‌ఎంబీ28కు పార్ధు, అర్జునుడు అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకు ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని టాక్. దీంతో మహేష్‌బాబు (MaheshBabu), త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ28 టైటిల్‌ కూడా 'అ' తోనే మొదలవుతుందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28వ తేదీన సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) – రాజమౌళి సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌‌ రణ్​బీర్ కపూర్‌‌ నటించనున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!