Pushpa 2: బన్నీ (Allu Arjun) అభిమానులకు శుభవార్త.. ‘అవతార్ 2’ (Avatar 2)తో కలసి సందడి చేస్తానంటున్న పుష్పరాజ్!

Updated on Nov 05, 2022 03:02 PM IST
‘అవతార్ 2’ (Avatar 2) మూవీతో కలసి థియేటర్లలో సందడి చేయడానికి అల్లు అర్జున్ (Allu Arjun) సిద్దమవుతున్నారని తెలుస్తోంది
‘అవతార్ 2’ (Avatar 2) మూవీతో కలసి థియేటర్లలో సందడి చేయడానికి అల్లు అర్జున్ (Allu Arjun) సిద్దమవుతున్నారని తెలుస్తోంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒక్కో సినిమాతో తన రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ‘పుష్ప’ (Pushpa)కు ముందు వరకు ఆయనకు తెలుగు, మలయాళంలోనే క్రేజ్ ఉండేది. కానీ ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా హిట్‌గా నిలవడంతో ఆయన ఇమేజ్ కోలీవుడ్, బాలీవుడ్ వరకు పాకింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసి.. ఉత్తరాదిన అల్లు అర్జున్‌ను ఓవర్‌నైట్ స్టార్ చేసింది. ‘పుష్ప’ సినిమాలోని బన్నీ డైలాగ్స్, డ్యాన్స్ మూవ్స్‌ను పలువురు సెలబ్రిటీలు ఇమిటేట్ చేసి ఆకట్టుకున్నారు. 

‘పుష్ప’ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్‌ను మరింత భారీగా తీయాలని చిత్ర దర్శకుడు సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ భావిస్తున్నారు. సెకండ్ పార్ట్‌కు మరింత క్రేజ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా హాలీవుడ్ మూవీ ‘అవతార్ 2’ ద్వారా ‘పుష్ప 2’ నుంచి ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. 

హాలీవుడ్ మూవీ ‘అవతార్ 2’ (Avatar 2) సాయం తీసుకోవాలని సుకుమార్ టీమ్ భావిస్తున్నారట

ప్రమోషన్స్ విషయంలోనూ ‘పుష్ప 2’ (Pushpa 2) టీమ్ తగ్గేదేలే అంటోంది. సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ప్రచారం చేయాలని భావిస్తోంది. అందుకోసం హాలీవుడ్ మూవీ ‘అవతార్ 2’ (Avatar 2) సాయం తీసుకోవాలని సుకుమార్ టీమ్ భావిస్తున్నారట. అల్లు అర్జున్ సలహా మేరకు ‘అవతార్ 2’ చిత్రంతోపాటు చాలా దేశాల్లో ఈ టీజర్ వైరల్ అయ్యేలా చేయాలని అనుకుంటున్నారట. అందుకోసం మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. 

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా..

‘అవతార్ 2’ సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో ‘పుష్ప 2’ ఫస్ట్ లుక్ టీజర్‌ను ప్రదర్శించాలన్నది సుకుమార్, బన్నీ ఆలోచన అని సమాచారం. ఇటీవల మొదలైన చిత్రీకరణలో మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌కు సంబంధించిన పార్ట్‌ను సుకుమార్ షూట్ చేశారట. ఇది తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. మరి, దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.    

‘పుష్ప’ విజయం ఉత్తరాదిన అల్లు అర్జున్‌ను ఓవర్ నైట్ స్టార్ చేసింది

బడ్జెట్ విషయంలో తగ్గేదేలే!

‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇటీవలే మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ఉత్తరాది మార్కెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ రకంగానూ తగ్గేదేలే అనే విధంగా ‘పుష్ప 2’ను రూపొందిస్తున్నారట. ఈ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల వరకు బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.500 కోట్ల వరకు జరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

Read more: EXCLUSIVE: అమ్మా, నాన్నలతో తప్పకుండా ఓ సినిమా తీస్తా.. వచ్చే ఏడాది మిస్ ఇండియా పోటీలకు వెళతా : శివాని రాజశేఖర్ (Shivani Rajashekar)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!