‘పుష్ప’, ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుల కాంబో.. సుకుమార్ (Sukumar), వివేక్ (Vivek Agnihotri) కలయికలో భారీ చిత్రం!

Updated on Nov 05, 2022 11:21 AM IST
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) కాంబోలో ఓ భారీ చిత్రం రానుందని తెలుస్తోంది.
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) కాంబోలో ఓ భారీ చిత్రం రానుందని తెలుస్తోంది.

సినీ పరిశ్రమలో క్రేజీ కాంబినేషన్లకు చాలా డిమాండ్ ఉంటుంది. హిట్లతో ఫామ్‌లో ఉన్న డైరెక్టర్లు, హీరోలతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతుంటారు. ఇండస్ట్రీలో హిట్లు ఉన్న వారికి ఎప్పుడూ అగ్ర తాంబూలమే. అందుకే విజయాల్లో ఉన్నవారితో కాంబినేషన్ సెట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ప్రయత్నిస్తుంటారు. అయితే ఒక్కోసారి అరుదైన కాంబినేషన్స్ సెట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ కాంబోలో బిగ్ మూవీ రానుందని తెలుస్తోంది. 

‘పుష్ప’ సినిమాతో జాతీయవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు దర్శకుడు సుకుమార్ (Sukumar). ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీతో సినీప్రియుల్ని మెప్పించారు. దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri), నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agrawal). ‘కార్తికేయ 2’ చిత్రంతో అభిషేక్ మరో బంపర్ హిట్‌ను కొట్టారు. ఇప్పుడు ఈ ముగ్గురి కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

ఎవరు డైరెక్ట్ చేస్తారో? 

‘సినిమాతో అంతా ఒక్కటి కాబోతున్నాం. అతి త్వరలో వివరాలు తెలియజేస్తాం. మీరు ఏమైనా ఊహించగలరా?’ అని ట్విట్టర్‌లో వివేక్ అగ్నిహోత్రి రాసుకొచ్చారు. వీరి కలయికలో తెరకెక్కబోయే సినిమాకు వివేక్, సుకుమార్‌ల్లో ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఈ ముగ్గురూ నిర్మాతలుగా వ్యవహరిస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ (Pushpa 2)తో బిజీబిజీగా ఉన్నారు. వివేక్ అగ్నిహోత్రి ‘ది ఢిల్లీ ఫైల్స్’ మూవీ చేస్తున్నారు.   

ఇకపోతే, ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించే సినిమాపై క్లారిటీ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆయన ఓ మూవీ తీస్తారనేది కన్ఫర్మ్ అయ్యింది. వీరి కలయికలో రానున్న కొత్త చిత్రానికి సంబంధించి ఇప్పటికే కొంత చిత్రీకరణ జరిపారని తెలుస్తోంది. ఈ మూవీలో చరణ్​ ఇంట్రడక్షన్ సీన్స్ ను ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కు ముందే సుకుమార్ షూట్ చేశారని సమాచారం. కాగా, ‘చాక్లెట్’ అనే హిందీ చిత్రంతో దర్శకుడిగా మారిన వివేక్ అగ్నిహోత్రి.. ఆ తర్వాత తీసిన ‘గోల్’, ‘హేట్ స్టోరీ’, ‘ది తాష్కెంట్ ఫైల్స్’తో బాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) చిత్రంతో టాలీవుడ్‌లోనూ ఆయన గుర్తింపు సంపాదించారు.  

Read more: EXCLUSIVE: సెలబ్రిటీలనే ఫిదా చేసేసిన సాఫ్ట్‌వేర్ కుర్రాడు సుమంత్ బొర్రా (Sumanth Borra).. 'పడిపోయా' సాంగ్‌కి సూపర్ రెస్పాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!