చరణ్ (Ram Charan)​ ఎంట్రీ సీన్‌ను షూట్ చేసేసిన సుకుమార్ (Sukumar).. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందే షూటింగ్!

Updated on Nov 03, 2022 01:09 PM IST
రామ్ చరణ్ (Ram Charan)​ ఎంట్రీ సీన్‌ను ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) రిలీజ్‌కు ముందే సుకుమార్ (Sukumar) తెరకెక్కించారని తెలుస్తోంది
రామ్ చరణ్ (Ram Charan)​ ఎంట్రీ సీన్‌ను ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) రిలీజ్‌కు ముందే సుకుమార్ (Sukumar) తెరకెక్కించారని తెలుస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ (Ram Charan) కెరీర్‌లో ‘రంగస్థలం’ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాతో చరణ్‌లో దాగి ఉన్న విభిన్నమైన నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు సుకుమార్ (Sukumar). ఈ మూవీతో వీరిద్దరిదీ క్రేజీ కాంబోగా మారింది. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మెగా హిట్‌గా నిలిచింది. దీంతో చరణ్​–సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో ఓ సరికొత్త ప్రాజెక్టు పట్టాలెక్కినట్లు తెలుస్తోంది. 

చరణ్​–సుకుమార్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే హీరో ఇంట్రడక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించారని తెలిసింది. ఈ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ రివీల్ చేశారు. ‘రామ్ చరణ్​–సుకుమార్ కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ రానుంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie)లో చరణ్​ శరీరాకృతి నచ్చడంతో సుకుమార్.. తన ప్రాజెక్టులోనూ చెర్రీని అదే లుక్‌లో చూపించనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందే పది నిమిషాలు నిడివి ఉన్న హీరో పరిచయ సన్నివేశాలను సుకుమార్ షూట్ చేశారు’ అని సాబు సిరిల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన చెర్రీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. 

చరణ్​ (Ram Charan) పరిచయ సన్నివేశాలను సుకుమార్ (Sukumar) షూట్ చేశారని సాబు సిరిల్ వెల్లడించారు

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్–చరణ్​ ప్రాజెక్టు గురించి రాజమౌళి చేసిన కామెంట్స్‌ను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ‘ఆయన అప్పుడే చెప్పాడు. మనమే అర్థం చేసుకోలేకపోయాం’ అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇకపోతే, రామ్ చరణ్​ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఆయన ఒక మూవీ చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇక, మరోవైపు ‘పుష్ప 2’ పనుల్లో సుకుమార్ ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు చాలా సమయం పట్టేలా ఉంది.  

Read more: పునీత్ రాజ్ కుమార్(Puneet Rajkumar): ‘కాంతార’(Kantara)లో ముందు అనుకున్న హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) కాదా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!