Pushpa The Rule: 'పుష్ప 2' షూటింగ్ సెట్ లో అడుగుపెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఫొటో వైరల్!

Updated on Oct 30, 2022 06:29 PM IST
'పుష్ప-2' (Pushpa 2) షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్.
'పుష్ప-2' (Pushpa 2) షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబోలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప' (Pushpa The Rise). ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు కేవలం సౌత్ కే పరిమితం అయిన అల్లు అర్జున్  ఈ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకొని ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.

పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నట విశ్వరూపం, సుకుమార్ (Director Sukumar) మేకింగ్ అన్ని హిందీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో.. అక్కడ 100 కోట్ల కలెక్షన్స్ తో పుష్ప అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు. దీంతో పుష్ఫ సీక్వెల్ గా రాబోతున్న 'పుష్ప 2' (Pushpa The Rule)పై అంచనాలు పెరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. 'పుష్ప-2' (Pushpa 2) షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రీకరణకు సంబంధించిన మరో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆదివారం పుష్ప సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లా క్యూబా బ్రోజెక్ (kubabrozek) పోస్ట్ చేసిన ఫొటో చూస్తుంటే సినిమా షూటింగ్ మొద‌లైంది నిజ‌మేన‌ని తెలుస్తోంది. అడ్వెంచ‌ర్ హాజ్‌ బిగెన్ అంటూ అల్లు అర్జున్‌తో క‌లిసి ఉన్న ఓ ఫొటోను మిరోస్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇందులో బ‌న్నీపై ఫ్రేమ్ సెట్ చేస్తూ మిరోస్లా క‌నిపిస్తున్నాడు. థాంక్స్ టూ ఐకాన్ స్టార్ అంటూ మిరోస్లా ఈ ఫొటోకు క్యాప్ష‌న్ జోడించాడు.

కాగా, పుష్ప చిత్ర యూనిట్ హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి ఇప్పుడు కీలక సన్నివేశాల కోసం బ్యాంకాక్ వెళ్లనున్నట్టుగా తాజా టాక్. అక్కడే రెండు నెలల పాటు షూటింగ్ జరుపుకోనుందట. అక్కడే ఎలాంటి బ్రేక్ లేకుండా బ్యాంకాక్ అడవుల్లో షూట్ జరగనుందని టాక్ వస్తోంది. అలాగే ఆ తర్వాత మారేడుమిల్లి లో కూడా కీలక షెడ్యూల్ జరగనుందట.

Read More: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రూల్' (Pushpa The Rule) ఆసక్తికర అప్డేట్.. షూటింగ్ లొకేషన్‌లో సుకుమార్‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!