Exclusive: సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్ లేకపోతే 'పుష్ప' లేనే లేదు: సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకల్లో అల్లు అర్జున్ (Allu Arjun) 

Updated on Oct 27, 2022 03:57 PM IST
EXCLUSIVE: "పుష్ప 2" నటనలోనైనా.. అవార్డులలోనైనా "అసలు తగ్గేదేలే" అంటున్న అల్లు అర్జున్.
EXCLUSIVE: "పుష్ప 2" నటనలోనైనా.. అవార్డులలోనైనా "అసలు తగ్గేదేలే" అంటున్న అల్లు అర్జున్.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)  'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో పాపులర్ స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్‌కు భారీ సక్సెస్‌ను అందించింది. అంతేకాదు భారీగా అవార్డులు కూడా తెచ్చిపెడుతోంది. 'పుష్ప' సినిమాకు ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి. 

"సిఎన్ఎన్ నెట్ వర్క్ 18" అందించే "ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2021" అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. అలాగూ 67 వ ఫిలిమ్ ఫేర్ అవార్డు వేడుకల్లో "పుష్ప" సినిమాకుగాను ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్ పురస్కారాన్ని అందుకున్నారు.  
  
మోస్ట్ పాపులర్ యాక్టర్
'పుష్ప' చిత్రం తాజాగా ప్రముఖ తెలుగు మీడియా సంస్థ సాక్షి అందిస్తున్న అవార్డులను కైవసం చేసుకుంది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ (Sakshi Excellence Awards) 2021 వేడుకల్లో 'పుష్ప' పలు అవార్డులను సొంతం చేసుకుంది. 'పుష్ప' చిత్రంలో హీరోగా నటించిన అల్లు అర్జున్‌కు "మోస్ట్ పాపులర్ యాక్టర్" అవార్డు లభించింది. .

సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 వేడుకల్లో 'పుష్ప'లో హీరోగా నటించిన అల్లు అర్జున్‌ (Allu Arjun)కు

అల్లు అర్జున్ లుక్
అల్లు అర్జున్ (Allu Arjun) ఈ అవార్డు వేడుకల్లో చాలా సైలిష్‌గా కనిపించారు. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో అల్లు అర్జున్ చాలా కూల్ లుక్‌లో మెరిసిపోయారు. బ్లాక్ ఐ గ్లాసెస్‌లో అల్లు అర్జున్‌ స్వాగ్ అందరినీ ఆకట్టుకొనేలా ఉంది. 

నెక్ట్స్ ఇయర్ అవార్డు నేనే తీసుకోవాలి : అల్లు అర్జున్
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2020 కి సంబంధించి మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును అల్లు అర్జున్ తీసుకున్నారు. 'అలా వైకుంఠపురంలో' సినిమాకుగాను బన్నీకి ఈ అవార్డు లభించింది. ఇక ఈ సంవత్సరం సాక్షి మీడియా ఇచ్చిన ఎక్సలెన్స్ అవార్డును అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో కైవసం చేసుకున్నారు. 

వచ్చే సంవత్సరం కూడా 'సాక్షి ఎక్సలెన్స్ అవార్డు' తనకే రావాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ (Allu Arjun) తెలిపారు. వరుసగా మూడేళ్లు అవార్డు తీసుకున్న హీరోగా హ్యాట్రిక్ కొట్టాలనేది తన ఆశ అని మనసులోని మాటను బయటపెట్టారు. దర్శకుడు సుకుమార్‌తో పాటు 'పుష్ప' సినిమా కోసం హార్డ్ వర్క్ చేసిన అందరికీ తన అవార్డును డెడికేట్ చేస్తున్నానని ప్రకటించారు.

సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 వేడుకల్లో 'పుష్ప'లో హీరోగా నటించిన అల్లు అర్జున్‌ (Allu Arjun)కు

ఎమోషనల్ అయిన అల్లు అర్జున్
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021 వేడుకల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రికి లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సిరివెన్నెల గురించి అనేక విషయాలను పంచుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఎంతో గొప్పదని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. 'కోనసీమ కుర్రదాన్నిరో' వంటి పాటలను కూడా ఎంతో అర్థవంతంగా రాసే గొప్ప లిరిక్ రైటర్ సిరివెన్నెల అని దేవిశ్రీ అభిప్రాయపడ్డారు.

దేవిశ్రీ ప్రసాద్ సిరివెన్నెల సాహిత్యం గురించి చెబుతున్న సమయంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఆర్య, హ్యాపీ, పరుగు, అలా వైకుంఠపురంలో లాంటి చిత్రాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. 

సీక్వెల్ సినిమాలో బిజీగా బన్ని
'పుష్ప - ది రైజ్' సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'పుష్ప - ది రూల్' చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్‌లో కూడా అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తున్నారు. మరి అల్లు అర్జున్ 'పుష్ప - ది రూల్' సినిమాతో ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టనున్నారో చూడాలి.

దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప సినిమానే లేదన్నారు అల్లు అర్జున్. సుకుమార్ (Sukumar) గైడెన్స్ ప్రకారమే ఈ సినిమాలో నటించానని చెప్పారు. అలాగే 'పుష్ప' సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌‌ను సాక్షి అవార్డుల వేడుకల్లో అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు. తన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ బెస్ట్ మ్యూజిక్ ఇస్తుంటారని తెలిపారు. 

ఇదే క్రమంలో 'పుష్ప 2' సినిమాకి సంబంధించి ఓ హింట్ ఇస్తూ "అస్సలు తగ్గేదేలే" అనే డైలాగ్‌ను అల్లు అర్జున్, దేవీశ్రీ ప్రసాద్ పలుమార్లు వేదికపై పలికారు. "తగ్గేదేలే" అనే డైలాగ్ "పుష్ప" సినిమా ద్వారా ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో "అస్సలు తగ్గేదేలే" అనే కొత్త డైలాగ్ "పుష్ప 2"లో ఉండే అవకాశముందా? అనేది సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు. 

ఇక 'పుష్ప' సినిమా పాటలు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ పొందిన సాంగ్స్‌‌గా కొత్త రికార్దులు తిరగరాశాయని అల్లు అర్జున్ గుర్తుచేశారు. 'పుష్ప' మ్యూజిక్ ఆల్బబ్ ఇండియాలో ఇంత పాపులర్ అవ్వడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్ అని తెలిపారు. పుష్ప సినిమా కోసం పనిచేసిన టెక్నిషియన్లతో పాటు, తోటి నటీనటులకు.. అలాగే అవార్డు అందించిన సాక్షి మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్. సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2022 ఈవెంట్ అక్టోబర్ 29 తేదీన సాయంత్రం 5 గంటలకు సాక్షి టీవీలో ప్రసారం కానుంది.

Read More: "ఆర్య" నుంచి "పుష్ప" వరకూ .. విభిన్న పాత్రలకు ప్రాణం పోస్తూ "అల్లు అర్జున్" (Allu Arjun) పొందిన అవార్డులెన్నో !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!