EXCLUSIVE: అమ్మా, నాన్నలతో తప్పకుండా ఓ సినిమా తీస్తా.. వచ్చే ఏడాది మిస్ ఇండియా పోటీలకు వెళతా : శివాని రాజశేఖర్ (Shivani Rajashekar)

Updated on Nov 05, 2022 04:04 PM IST
నటనతో పాటు చదువు కూడా నాకు ముఖ్యమే - శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar)
నటనతో పాటు చదువు కూడా నాకు ముఖ్యమే - శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar)

శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar).. నటనా రంగంలో  తండ్రి రాజశేఖర్ పేరును నిలబెడుతూ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నటిగా రాణించడమే కాకుండా.. నిర్మాతగా కూడా అనేక సినిమాలు నిర్మించారు.

ప్రస్తుతం "అహ నా పెళ్ళంట" వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు. ప్రేక్షకులతో 'మహానటి' అనిపించుకునే స్థాయిలో నటించేందుకు కృషి చేస్తున్నానని చెప్పే శివాని, అదే లక్ష్యంతో ముందుకు సాగిపోతున్నారు. 

నటనతో పాటు చదువుకు కూడా సమ ప్రాధాన్యం ఇస్తూ, కెరీర్‌లో దిగ్విజయంగా దూసుకుపోతున్నారు ఈతరం నటి శివాని రాజశేఖర్. అందం, అభినయంతో పాటు.. అందరినీ కట్టి పడేసే చిరునవ్వు ఆమె సొంతం. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అనేది ముఖ్యం కాదని.. ప్రేక్షకులకు నచ్చే పాత్ర ఏదైనా చేయడానికి తాను సిద్ధమేనని చెప్పే నటి శివాని రాజశేఖర్‌తో పింక్‌విల్లా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం !

నటనతో పాటు చదువు కూడా నాకు ముఖ్యమే : శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar)

హాయ్ శివాని రాజశేఖర్ గారు. ఇప్పటి వరకు మీరు సినిమాల్లోనే నటించారు. కానీ తొలిసారిగా 'అహ నా పెళ్ళంట' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏంటి?

'అహ నా పెళ్ళంట' ఓ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.  ఈ వెబ్ సిరీస్ జీ 5లో నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 8 ఎపిసోడ్లు గల ఈ సిరీస్ ప్రధానంగా మ్యాడ్ కామెడీ కంటెంట్‌ను బేస్ చేసుకొని తెరకెక్కింది. ఇదో కొత్త ప్రయోగం. ఈ వెబ్ సిరీస్‌ను పిల్లలతో పాటు పెద్దలు కూడా సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. 
 
'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌లో మీ పాత్ర గురించి చెప్పిండి?
'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌లో నా పాత్ర పేరు మహా. మహా స్వతంత్ర భావాలు కలిగిన యువతి. తనకంటూ ఓ లక్ష్యం ఉన్న అమ్మాయి. సరదాగా అందిరితో కలిసిపోతుంది. మహా తప్పు చేయదు. ఎవరు తప్పు చేసినా సహించదు. ఈ వెబ్ సిరీస్‌లో నా పాత్ర వెరీ స్ట్రాంగ్‌గా, వెరీ క్యూట్‌గా, వెరీ ఎనర్జిటిక్‌గా ఉంటుంది.

 

'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ చేయడానికి కారణం ఏంటి?
'అహ నా పెళ్లంట' వెబ్ సిరీస్ చేయడానికి ప్రధాన కారణం, నాకు కథ బాగా నచ్చడమే. దర్శకుడు సంజీవ్ రెడ్డి గారు స్టోరిని చాలా ఎఫెక్టివ్‌గా రాశారు. అందుకే నేను ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నాను. 
 
ఇప్పటి వరకు మీరు సినిమాల్లోనే నటించారు. కానీ తొలిసారిగా వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తున్నారు. వెబ్ సిరీస్‌లో యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది?

నేను స్వతహాగా నటిని. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు నాకు ఉండవు. వెబ్ సిరీస్ చేసినప్పుడు కూడా, నేను ఇలాగే ఆలోచించాను. ఓ మంచి నటిగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నానా లేదా? అనేదే ముఖ్యం. మాధ్యమం ఏదైతే ఏముంది? కథ నచ్చితే.. చిన్న పాత్ర అయినా చేయడానికి రెడీగా ఉంటాను. 
 
రాజ్ తరుణ్‌తో కలిసి నటించడం ఎలా ఉంది?
రాజ్ తరుణ్‌కు కూడా ఇదే మొదటి వెబ్ సిరీస్. ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే నటీనటులు కలిసి నటించిన తరువాతే, మంచి స్నేహితులు అవుతారు. రాజ్ తరుణ్ నాకు మొదటి నుంచి మంచి ఫ్రెండ్. స్నేహితుడితో కలిసి నటించడం అంటే ఎవరికైనా హ్యాపీనే కదా. ఇద్దరం సెట్స్‌లో చాలా సరదాగా గడిపాం.
 
'అహ నా పెళ్ళంట' టీమ్ అందరూ మిమ్మల్ని మహానటి అంటున్నారు. దీనిపై మీ స్పందన ?

ఈ సిరీస్ షూటింగ్ జరుగుతున్నప్పుడు, టీమ్ అందరం సరదాగా ఎంజాయ్ చేశాం. మా టీమ్ నన్ను 'మహానటి' అనడం చాలా ఆనందంగా ఉంది. అయితే అది చాలా పెద్ద పొగడ్త. ఈ వెబ్ సిరీస్ చూసిన ప్రేక్షకులకు కూడా నా నటన నచ్చాలి. అదే నాకు పెద్ద సక్సెస్ అని భావిస్తాను. 
 
మీరు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు.  భవిష్యత్తులో మీరు ఏదైనా వెబ్ సిరీస్‌కు నిర్మాతగా  వ్యవహరించే అవకాశం ఉందా?

మంచి కథ దొరికితే, కచ్చితంగా భవిష్యత్తులో వెబ్ సిరీస్‌‌ను కూడా ప్రొడ్యూస్ చేస్తాను. 

'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌లో పెళ్లి కూతురి గెటప్‌లో చాలా బాగున్నారు. మీ కాస్ట్యూమ్స్ గురించి చెబుతారా? 

చాలా థ్యాంక్స్ అండి. నటి అయ్యాక అన్ని రకాల కాస్ట్యూమ్స్ వేసుకోవాలి కదా. ఈ వెబ్ సిరీస్‌లో నా కాస్ట్యూమ్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.
 
నటిగా మీరు చేయాలనుకునే డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? అలాగే నిర్మాతగా ఎలాంటి సినిమాను నిర్మించాలనేది మీ కోరిక?

నటిగానైనా, నిర్మాతగానైనా ఓ మంచి సినిమా చేయాలనేదే నా కోరిక. నేను నటించిన సినిమాలైనా లేదా నిర్మించిన సినిమాలైనా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలనేదే నా కల.
 
మీ తల్లిదండ్రులైన జీవిత, రాజశేఖర్ గార్లకు ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. మీరు మీ అమ్మ, నాన్నలతో కలిసి ఓ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మీ ఫ్యాన్స్ కలను మీరు నెరవేర్చే అవకాశం ఉంది?

అమ్మానాన్నలతో కలిసి ఓ సినిమా చేయాలనేది నా డ్రీమ్. అన్ని కుదిరితే.. కచ్చితంగా అందరం కలిసి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాం.

'ఫెమినా మిస్ ఇండియా 2022' ఫైనల్స్‌కు మీరు వెళ్లలేకపోయారు? కారణం ఏంటి?

'ఫెమినా మిస్ ఇండియా 2022' ఫైనల్స్ సమయంలో.. మా మెడిసిన్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. చదువు అనేది కూడా నా జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. అందుకే బాగా ఆలోచించి, పోటీ నుండి విత్ డ్రా అయ్యి, ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికే నిశ్చయించుకున్నాను. 'మిస్ ఇండియా' పోటీలకు వెళ్లలేకపోయినందుకు తర్వాత చాలా బాధపడ్డాను. కానీ వచ్చే సంవత్సరం తప్పకుండా ఈ పోటీలకు వెళతాను.

అహ నా పెళ్ళంట గురించి ఫైనల్ గా ఏం చెబుతారు?.
'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌ను దర్శకుడు సంజీవ్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. జీ 5 (Zee5), తమడా మీడియా కలిసి ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఓ బెస్ట్ డైరెక్టర్‌తో పాటు, ఇద్దరు బెస్ట్ నిర్మాతలు తీసిన వెబ్ సిరీస్ ఇది. మీరు కూడా 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌ను చూడండి.  థ్యాంక్యూ పింక్ విల్లా.

Read More: ఎంటర్‌‌టైనింగ్‌గా రాజ్ తరుణ్‌ (Raj Tarun) ‘అహ నా పెళ్లంట’ ట్రైలర్.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!