Samantha : సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న "శాకుంతలం" త్రీడీలో రిలీజ్ కానుందట !

Updated on Sep 30, 2022 01:58 PM IST
Samantha : సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న 'శాకుంతలం' సినిమాపై దర్శకుడు గుణశేఖర్‌కు భారీ అంచనాలే ఉన్నాయి.
Samantha : సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న 'శాకుంతలం' సినిమాపై దర్శకుడు గుణశేఖర్‌కు భారీ అంచనాలే ఉన్నాయి.

గుణశేఖర్ (Gunasekhar) .. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. సొగసు చూడతరమా, మనోహరం, ఒక్కడు, చూడాలని ఉంది, బాల రామాయణం, రుద్రమదేవి లాంటి సినిమాలను తెరకెక్కించి గొప్ప క్రియేటివ్ దర్శకుడిగా ఆయన పేరుగాంచాడు. ఇప్పడు గుణశేఖర్ "శాకుంతలం"  (Shaakuntalam) పేరిట సమంత కథానాయికగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ రాలేదు. ఆ మధ్యకాలంలో నవంబర్ 4వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని మేకర్స్ తెలిపారు. అయితే ఇప్పుడు ఆ తేది కూడా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

గ్రాఫిక్ వర్క్ మీద ప్రత్యేక శ్రద్ధ 

అయితే ఈ ఆలస్యానికి కారణం త్రీడి వర్క్ అని వినికిడి. దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మాట్‌లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా ఈ సినిమాలోని గ్రాఫిక్ వర్క్ కోసం స‌రికొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని సైతం వాడారట. 

ప్రత్యేక పాత్రలో బేబీ అర్హ

ఈ చిత్రంలో సమంత (Samantha) శకుంతలగా టైటిల్ రోల్‌లో నటించగా.. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, మధుబాల, గౌతమి మొదలైనవారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కుమార్తె బేబీ అర్హ ఈ చిత్రంలో భరతుడి పాత్రలో కనిపిస్తుందట. చైల్డ్ ఆర్టిస్టుగా ఆమెకు ఇదే తొలి సినిమా. 

దేవ్ మోహన్ (Dev Mohan) ఈ చిత్రంలో దుష్యంతుడిగా కనిపిస్తారట. బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. శేఖర్ జోసఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానరుపై ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రానికి పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. 

Read More: సమంత (Samantha) 'శాకుంతలం' (Shakuntalam) నుంచి బిగ్ అప్ డేట్.. గ్రాఫికల్ వర్క్ లో బిజీగా మూవీ యూనిట్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!