స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించిన టాప్‌5 హీరోయిన్లు

Updated on Nov 29, 2022 10:51 PM IST
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించారు హీరోయిన్లు
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించారు హీరోయిన్లు

సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా ఆకర్షించడానికి దర్శకనిర్మాతలు చాలా కష్టపడుతుంటారు. దాని కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తుంటారు కూడా. హీరోహీరోయిన్ల ఎంపిక, కథతోపాటు పాటలు, సంగీతం కూడా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటారు.  

వీటన్నింటితోపాటు కమర్షియల్‌ సినిమాల్లో మాస్‌, యాక్షన్ సీన్లు కూడా సక్సెస్‌ను నిర్ణయిస్తాయి. వాటితోపాటు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చేందుకు చాలాకాలం నుంచి దర్శకనిర్మాతలు చేస్తున్న మరో పని స్పెషల్ సాంగ్స్‌ ఉండేలా చూసుకోవడం. పాత సినిమాల్లో కూడా ప్రత్యేక గీతాలు ఉండేవి.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లతో ప్రత్యేక గీతాల్లో డాన్స్ చేయించడం అనే ట్రెండ్ కొనసాగుతోంది. అందులో భాగంగా పలువురు టాప్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో ఇదివరకు కూడా నర్తించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన సమయంలో వాళ్లు ప్రత్యేక గీతాలు చేశారు. వాళ్లలో రంభ, రమ్యకృష్ణ పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఆ ట్రెండ్‌లో మార్పు వచ్చింది. స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూనే, వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ స్పెషల్ సాంగ్స్‌లో డాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటి హీరోయిన్లు. ప్రత్యేక గీతాల్లో నర్తించిన టాప్‌5 హీరోయిన్ల గురించిన విశేషాలు పింక్‌విల్లా వ్యూయర్స్‌ కోసం.

హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించారు

సమంత (Samantha) :

ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టారు సమంత (Samantha). ఆ సినిమాలో తన అందం, అభినయంతో యువత గుండెల్లో చోటు దక్కించుకున్నారు. అనంతరం, దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన సామ్.. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. గ్లామర్‌‌ క్యారెక్టర్లతోపాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా పోషిస్తున్నారు.

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లోనూ నటించి హిట్స్ అందుకున్నారు. స్పెషల్ సాంగ్స్‌లోనూ నర్తించి అభిమానులను అలరిస్తున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప సినిమాలోని ప్రత్యేక గీతంలో డాన్స్ చేసి సినీ ప్రేమికులను ఉర్రూతలూగించారు. ఇండియాతోపాటు వివిధ దేశాల్లో కూడా ‘ఊ అంటావా మామా’ పాట విపరీతంగా వైరల్ అయ్యింది.   

హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించారు

తమన్నా (Tamannaah) :

మంచు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఈ సినిమా తర్వాత పలు సూపర్‌‌హిట్ సినిమాల్లో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. అందం, అభినయంతోపాటు డాన్స్‌లోనూ తమన్నా ఎక్స్‌పర్ట్ అనే విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే పలు ప్రత్యేక గీతాలు చేశారు మిల్కీ బ్యూటీ. సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో నర్తించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించారు

పూజా హెగ్డే

ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్ పూజా హెగ్డే. వరుసగా హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగుతోపాటు హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు పూజా. ఇంత బిజీగా ఉన్న సమయంలో కూడా ప్రత్యేక గీతాలు చేయడానికి ఓకే చెప్తున్నారు.

మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హిట్‌ సినిమా రంగస్థలం. ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో నర్తించి కుర్రకారు మనసు దోచుకున్నారు పూజా హెగ్డే. విక్టరీ వెంకటేష్, వరుణ్‌ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎఫ్‌3. ఎఫ్‌2 సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ చేశారు పూజా.

హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించారు

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) :

చందమామ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కాజల్ అగర్వాల్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగులో టాప్ హీరోల సరసన నటిస్తూనే స్పెషల్ సాంగ్స్‌లో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూనే ప్రత్యేక గీతాల్లో నర్తిస్తూ ఫ్యాన్స్‌ను అలరించారు చందమామ.

 జూనియర్ ఎన్టీఆర్‌‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌‌హిట్ సినిమా జనతా గ్యారేజ్. ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో నర్తించారు చందమామ కాజల్ అగర్వాల్. పక్కా లోకల్ అంటూ సాగే ఈ పాటతో గ్లామరస్‌గా కనిపిస్తూ మాస్‌ స్టెప్స్ వేసి థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించారు కాజల్.

హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి అభిమానులను అలరించారు

శృతిహాసన్ (Shruti Haasan) :

లోకనాయకుడు కమల్‌హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి వచ్చారు హీరోయిన్ శృతిహాసన్. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడింది. అయితే శృతిహాసన్‌కు మాత్రం మంచిపేరు వచ్చింది.

తన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శృతి.. మహేష్‌బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆగడు సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో నర్తించారు. వీళ్లే కాకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్స్‌లో నర్తించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారిలో  అనుష్క, హెబ్బాపటేల్, చార్మి, హన్సిక పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

Read More : అందంతోనే కాదు విలనిజంతోనూ మెప్పించిన టాప్‌6 హీరోయిన్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!