బాలీవుడ్‌లో మరో క్రేజీ సినిమాలో సమంత (Samantha)కు ఆఫర్.. ఈసారి యువరాణి క్యారెక్టర్‌‌లో కనిపించనున్న సామ్

Updated on Sep 17, 2022 06:41 PM IST
సమంత (Samantha) తెలుగులో ప్రస్తుతం ఖుషి, యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి
సమంత (Samantha) తెలుగులో ప్రస్తుతం ఖుషి, యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి

ఏ మాయ చేశావె సినిమాతో కుర్రాళ్ల గుండెలను మాయ చేశారు సమంత (Samantha). తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. టాలీవుడ్‌ దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించిన సమంత.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మొదటి సినిమా ఏ మాయ చేశావె సినిమాలో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సమంత. అయితే పలు కారణాలతో తరువాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

సౌత్‌లో స్టార్‌‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనే సమంతకు బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక వాటిని వదులుకున్నారు. కరోనా కారణంగా వచ్చిన గ్యాప్‌లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు సమంత. ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్‌2 వెబ్‌ సిరీస్‌లతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక, పుష్ప సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌ సమంత క్రేజ్‌ను ఒక్కసారిగా డబుల్ చేసేసింది.

సమంత (Samantha) తెలుగులో ప్రస్తుతం ఖుషి, యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి

హారర్ కామెడీలో..

దీంతో సమంతకు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నటించే ఆఫర్లు వస్తున్నాయి. హాలీవుడ్‌ డైరెక్టర్స్‌ రూసో బ్రదర్స్‌ తెరకెక్కించిన ‘సిటాడెల్‌’ హిందీ రీమేక్‌ ఇప్పటికే సెట్స్‌పై ఉంది. ఇప్పుడు మరో ఆఫర్ వచ్చింది సమంతకు. దినేష్‌ విజన్‌ మ్యాడాక్‌ ఫిలింస్‌ సంస్థ తెరకెక్కించనున్న హారర్‌ కామెడీ సినిమాలో సమంత హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. ఈ సంస్థ ఇప్పటికే ‘స్త్రీ’, ‘బేడియా’ వంటి విజయవంతమైన హారర్‌ చిత్రాలను నిర్మించింది.

ఈ సినిమాలో సమంత యువరాణి క్యారెక్టర్‌‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఆయుష్మాన్‌ ఖురానా వ్యాంపైర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సమంత క్యారెక్టర్‌‌ చాలా ఇంట్రెస్టింగ్‌ ఉండనుందని చెబుతోంది చిత్ర యూనిట్. ప్రస్తుతం సమంత (Samantha) తెలుగులో ఖుషి, శాకుంతలం, యశోద సినిమాలు చేస్తున్నారు.

Read More : మోస్ట్‌ పాపులర్ తెలుగు సెలబ్రిటీగా ప్రభాస్ (Prabhas)..ఫిమేల్ సెలబ్రిటీ సమంత (Samantha):ఆర్మాక్స్‌ మీడియా సర్వే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!