విజయ్ దేవరకొండకు పెరుగుతోన్న ఫాలోయింగ్... సమంత (Samantha) 'ఖుషీ' సినిమాకు ఎందుకు డేట్స్ ఇవ్వడం లేదు ?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన పాన్ ఇండియా సినిమా 'లైగర్' అనుకున్నంత సక్సెస్ కాలేదు. సినిమా హిట్టా.. ఫట్టా అనేది పట్టించుకోకుండా విజయ్ కొత్త సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత (Samantha) కాంబోలో 'ఖుషీ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మెదటి షెడ్యూల్ షూటింగ్ కశ్మీర్‌లో జరిగింది.
'ఖుషీ' సినిమాతో విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ హిట్ సాధిస్తారని అభిమానులు ఆశ పడుతున్నారు. కానీ సమంత కారణంగా 'ఖుషీ' సినిమా ఆలస్యమవుతుందనే వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
విజయ్‌కు పెరుగుతోన్న ఫ్యాన్స్
'లైగర్' సినిమా ఫ్లాప్‌గా నిలిచినా, విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు దక్కాయి. విజయ్ దేవరకొండకు రోజు రోజుకు ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. విజయ్ దేవరకొండ నార్త్ ఇండియాలో ఫేమస్ హీరో అయ్యారు. విజయ్, సమంత (Samantha) కాంబోలో 'ఖుషీ' సినిమాను దర్శకుడు శివ నిర్వాణ పాన్ ఇండియా లెవల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవడం ఖాయమని పలువురు సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
సమంత బిజీ!
పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి ఐటం సాంగ్ చేసిన సమంత (Samantha) కు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఆమె పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. 'యశోద', 'శాకుంతలం' సినిమాల్లో ప్రస్తుతం సమంత నటిస్తున్నారు. అయితే పలు ఇతర సినిమాల షూటింగ్స్‌కు కూడా హాజరవడంతో సమంత షెడ్యూల్ బిజీ అయింది.
'ఖుషీ' సినిమాకు సమంత తక్కువ డేట్స్ ఇచ్చారట. దీంతో 'ఖుషీ' సినిమా షూటింగ్ ఆలస్యం కానుందట. ఈ క్రమంలో సమంత వల్లే 'ఖుషీ' సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వార్తపై 'ఖుషీ' మేకర్స్ క్లారిటీ ఇవ్వాలని సమంత అభిమానులు కోరుతున్నారు.