The Family Man 3: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్‌కు సన్నాహాలు.. సమంత (Samantha Ruth Prabhu)కు చాన్స్ ఇస్తారా?

Updated on Nov 26, 2022 01:56 PM IST
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ (The Family Man 3) వెబ్ సిరీస్‌లో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తారా లేదా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ (The Family Man 3) వెబ్ సిరీస్‌లో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తారా లేదా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది

కరోనా కారణంగా వెబ్ సిరీస్‌లకు పాపులారిటీ మరింత పెరిగింది. కొవిడ్ వల్ల థియేటర్లు మూతపడిన సమయంలో సినీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది వెబ్ సిరీస్‌లే. భాషలతో సంబంధం లేకుండా హిట్ వెబ్ సిరీస్‌లను చూసేందుకు ఆడియెన్స్ ఉత్సాహం చూపారు. మన చిత్ర పరిశ్రమలో కూడా అలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఉన్న కంటెంట్ మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్ సిరీస్‌ల పుణ్యమా అని కరోనా తర్వాత వస్తున్న సినిమాల్లో కంటెంట్ బాగుందంటూ ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. గతంతో పోలిస్తే మూవీ స్టోరీ ఎలా ఉంది, దర్శకుడు ఎలా తెరకెక్కించారు, నటులు ఎంత బాగా యాక్ట్ చేశారనే విషయాలపై ఇప్పుడు ఆడియెన్స్ బాగా దృష్టి పెడుతున్నారని సినీ విమర్శకులు చెబుతున్నారు. ఈ మార్పునకు క్వాలిటీ కంటెంట్‌తో వచ్చిన వెబ్ సిరీస్‌లే కారణమని అంటున్నారు. 

‘ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ గురించి మనోజ్ బాజ్‌పాయ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు

క్వాలిటీ వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే.. ఇండియాలో మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ను ఈ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ సూపర్ హిట్టవ్వడంతో సీజన్ 2ను కూడా తీశారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించారు. ఈ సీజన్ కూడా బంపర్ హిట్టవ్వడంతో తదుపరి సీజన్ ఎప్పుడొస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. 

‘ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ గురించి మనోజ్ బాజ్‌పాయ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సీజన్ 3 (The Family Man 3)ని త్వరగా మొదలుపెట్టడానికి అమెజాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. కానీ దర్శకులు రాజ్, డీకేలతో పాటు తాను కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నామని చెప్పారు. ‘ఈ ఏడాది వరకు రాజ్, డీకేలతోపాటు నేను ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాం. వచ్చే ఏడాది ప్రారంభంలో సీజన్ 3ని మొదలుపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని మనోజ్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. 

తొలి రెండు సీజన్లలో నటించిన నటులతోపాటు ఈసారి పలువురు కొత్తవాళ్లు కూడా మూడో సీజన్లో చేరనున్నట్లు సమాచారం. అయితే ఇందులో సమంత (Samantha Ruth Prabhu) పాత్ర ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై సిరీస్ మేకర్స్ స్పందించే వరకు స్పష్టత రాదనే చెప్పాలి. రెండో సీజన్ ఆఖర్లో సమంత పాత్ర చనిపోయినట్లుగా చూపిన విషయం విదితమే. కాగా, దర్శకులు రాజ్, డీకే గతంలో సామ్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తామని అన్నారు. మరి, ఆ మాట ప్రకారం సీజన్ 3లో సమంతను తీసుకుంటారో లేదో చూడాలి. ఒకవేళ ఆమెను తీసుకున్నా సామ్ అనారోగ్య సమస్యలతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. కాబట్టి ఆమె నటించేందుకు ఒప్పుకుంటారా అనేది చూడాలి. 

Read more: Tollywood: ఈ ఏడాది రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!