Telugu Movies : 2022లో విడుదలైన టాప్ 10 బెస్ట్ టాలీవుడ్ చిత్రాలపై ప్రత్యేక కథనం..

Updated on Dec 06, 2022 10:12 AM IST
Telugu Movies : 2022లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' భారతీయ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లను వసూళ్లు చేసింది.
Telugu Movies : 2022లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' భారతీయ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లను వసూళ్లు చేసింది.

Telugu Movies : తెలుగు సినిమా పరిశ్రమకు 2022 చాలా ప్రత్యేక మైంది. ఈ ఏడాది విడుదలైన 'ఆర్ఆర్ఆర్' టాలీవుడ్ రేంజ్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా రికార్డులు మీద రికార్డులు బద్దలు కొట్టుకుంటూ దూసుకెళుతోంది. బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే టాలీవుడ్‌ (Tollywood) చిత్రాలు సక్సెస్ దిశలో దూసుకెళుతున్నాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలపై పింక్ విల్లా స్పెషల్ స్టోరి.

బంగార్రాజు

బంగార్రాజు

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన పెద్ద కుమారుడు నాగచైతన్యతో కలిసి నటించిన సినిమా 'బంగార్రాజు'. 2022లో హిట్ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయింది. 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించారు.

అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున 'బంగార్రాజు' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి కీలక పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. 'బంగార్రాజు' సినిమాను రూ. 25 కోట్లతో తెరకెక్కించారు. ఈ సినిమా రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

డిజే టిల్లు

డిజే టిల్లు

'డిజే టిల్లు' ఫిబ్రవరి 11న విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విమల్‌కృష్ణ దర్శకత్వం వహించారు. డిజే టిల్లు సినిమాను రూ. 10 కోట్లతో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లను వసూళ్లు చేసి ట్రిపుల్ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. 

 భీమ్లా నాయక్

భీమ్లా నాయక్

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఫిబ్రవరి 25 తేదీన విడుదలైంది. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను రూ. 75 కోట్ల రూపాలయతో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ దాదాపు రూ. 252 కోట్లను కొల్లగొట్టి పవన్ కల్యాణ్‌కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది. 

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం

'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్) (RRR) సినిమా యాక్షన్ ఎంటర్‌టైన్ చిత్రంగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమా 2022 మార్చి 25 తేదీన విడుదలైంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీముడిగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు దేశం కోసం పోరాటం చేసే పాత్రలో ఒదిగిపోయారు. 

'ఆర్ఆర్ఆర్' విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాను రూ. 550 కోట్లతో నిర్మించగా.. దాదాపు రూ.1135 కోట్లను వసూళ్లు చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఆర్ఆర్ఆర్ ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 'ఆర్ఆర్ఆర్' వంద రోజులు సక్సెస్ ఫుల్‌గా ఆడి మరో రికార్డును సొంతం చేసుకుంది. 

ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్, శ్రియా. అజయ్ దేవగణ్,పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. 'ఆర్ఆర్ఆర్' కథను ర ాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాశారు. 

ఎఫ్ 3

ఎఫ్ 3

'ఎఫ్ 3' సినిమా కామెడి ఎంటర్టైనర్ చిత్రంగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ. 70 కోట్లతో నిర్మించారు.  'ఎఫ్2' సినిమాకు సీక్వెల్‌గా చిత్రీకరించిన 'ఎఫ్3' ఈ ఏడాది మే 27 తేదీన రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి రూ.129 కోట్లు వసూళ్లు చేసింది. దేవి శ్రీ ప్రసాద్  సంగీతం అందించారు. 

సర్కారు వారి పాట

సర్కారు వారి పాట

మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైన్ చిత్రంగా 2022 మే 12 తేదీన విడుదలైంది. మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటించారు. 'సర్కారు వారి పాట' విడుదలైన మొదటి రోజు నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. పరశురామ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ చిత్రం రూ. 60 కోట్లతో నిర్మిస్తే.. దాదాపు రూ. 178 కోట్లు వసూళ్లు చేసింది. 

'సర్కారు వారి పాట'సినిమాను మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకి సంగీతం థమన్ ఎస్ అందించారు.

మేజర్

మేజర్

26/11 ముంబై దాడుల్లోప్రాణ త్యాగంతో ఉగ్రవాదులను మట్టుబెట్టిన 'మేజర్' సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా 'మేజర్' చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో అడివి శేష్ 'మేజర్' పాత్రలో జీవించారు.  శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను రూ. 32 కోట్లతో హీరో మహేష్ బాబు నిర్మించారు.బాక్సాఫీస్ వద్ద మేజర్ రూ. 66 కోట్లను రాబట్టింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

కార్తికేయ 2

కార్తికేయ 2

'కార్తికేయ 2' సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్ సినిమాగా ఇండియా లెవల్‌లో హిట్ అయింది.  నిఖిల్ సిద్దార్థ్, అనుపమ, శ్రీనివాస్ రెడ్డి, సత్య అక్కల, ప్రవీణ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం చందు మొండేటి వహించారు. నిర్మాతలు టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని 2022 ఆగస్టు 13 తేదీన విడుదలైన 'కార్తికేయ 2' చిత్రం కేవలం రూ. 15 కోట్లతో నిర్మించారు. కలెక్షన్ పరంగా రూ.120 కోట్లు వసూళ్లు చేసి నిఖిల్ కెరీయర్‌లో బిగెస్ట్ హిట్‌గా నిలిచింది.  

సీతా రామం

సీతారామం

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ అద్భుతమైన ప్రేమ కావ్యం 'సీతారామం'. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై అశ్వినీదత్, స్వప్నదత్‌లు 'సీతారామం' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రూ. 30 కోట్లతో బరిలోకి దిగితే.. బాక్సాఫీస్ వద్ద రూ. 104 కోట్లు వసూళ్లు చేసింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

 

గాడ్ ఫాదర్

గాడ్ ఫాదర్

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ (God Father) తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరి, సత్య దేవ్, మురళి శర్మ, సునీల్ నటించారు. 'గాడ్ ఫాదర్' సినిమాకు దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. నిర్మాతలు ఎన్ వి ప్రసాద్, రామ్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం ఎస్ థమన్ అందించారు. అక్టోబర్ 5 తేదీన రిలీజ్ అయిన 'గాడ్ ఫాదర్' సినిమా రూ. 100 కోట్లను నిర్మించారు. ఈ చిత్రం దాదాపు రూ.145 కోట్లు వసూళ్లు చేసింది. 

Read More: ‘ఆదిత్య 369’ నుంచి ‘బింబిసార’ వరకు.. టాలీవుడ్‌ (Tollywood) టైమ్ ట్రావెల్ జోనర్ సినిమాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!