సమంత (Samantha) నటిస్తున్న ‘యశోద’ (Yashoda) సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్

Updated on Oct 17, 2022 05:18 PM IST
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. పుష్పలో స్పెషల్ సాంగ్ చేసిన సామ్.. దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. పుష్పలో స్పెషల్ సాంగ్ చేసిన సామ్.. దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు

 ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు సమంత (Samantha). తన అందం, అభినయంతో సినీ ప్రేమికులను అలరిస్తూ.. స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సమంత.. అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని మరింత పాపులర్ అయ్యారు. మోస్ట్‌ బ్యూటిఫుల్ కపుల్‌ అనిపించుకున్న ఈ జంట.. ఇటీవల విడాకులు తీసుకుని అందరికీ షాకిచ్చారు.

కాగా, విడాకుల తర్వాత సమంత కెరీర్‌‌ ఇబ్బందుల్లో పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నదానికి భిన్నంగా నాగచైతన్యతో విడాకుల తర్వాత.. సమంత మరింత వేగంగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లో కూడా క్రేజీ ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీ హీరోయిన్‌గా ఉన్నారు. ఇక, సమంత చేతిలో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్నాయి. ఒకటి శాకుంతలం, రెండోది యశోద (Yashoda). ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి.

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. పుష్ప లో స్పెషల్ సాంగ్ చేసిన సామ్.. దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు

టీజర్‌‌తో పెరిగిన అంచనాలు..

హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యశోద సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు సమంత. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న యశోద సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో  అంచనాలను భారీగా పెంచేశాయి. యశోద ఎప్పడు విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

సమంత హీరోయిన్‌గా నటించిన యశోద (Yashoda) సినిమా నవంబర్‌‌ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సమంత.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడారు. ఆ పాటకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది సమంతకు. అంతేకాదు.. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సమంత (Samantha).

Read More : బాలీవుడ్‌లో మరో క్రేజీ సినిమాలో సమంత (Samantha)కు ఆఫర్.. ఈసారి యువరాణి క్యారెక్టర్‌‌లో కనిపించనున్న సామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!