Yashoda Trailer: 'యశోద ఎవరో తెలుసు కదా! ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి'.. గర్భవతిగా సమంత (Samantha)!

Updated on Oct 27, 2022 06:23 PM IST
'యశోద' ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), తమిళంలో సూర్య (Hero Suriya), హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ విడుదల చేశారు.
'యశోద' ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), తమిళంలో సూర్య (Hero Suriya), హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ విడుదల చేశారు.

టాలీవుడ్ స్టార్ సమంత (Samantha) నటించిన హీరోయిన్ సెంట్రిక్ సినిమా ‘యశోద’ (Yashoda Movie). శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. సరోగసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. వివిధ భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు 'యశోద' ట్రైలర్ ని లాంచ్‌‌ని చేశారు. 

లవ్, ఎమోషన్, యాక్షన్ అండ్ థ్రిల్... రెండున్నర నిమిషాల కంటే తక్కువ నిడివి గల ట్రైలర్‌లో చూపించారు. ఇటీవల విడుదలైన టీజర్‌లో గర్భవతిగా కనిపించిన సమంత.. థ్రిలింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సవాళ్లని ఎదురీదుతూ కనిపించింది. దాంతో ఇప్పటికే ఈ 'యశోద' (Yashoda Movie) సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

'యశోద' ట్రైలర్ (Yashoda Trailer) ఎలా ఉందనే విషయానికి వస్తే... సరోగసీ గర్భం దాల్చిన యువతులు కొందర్నీ సకల వసతులు, వైద్య సౌకర్యాలు కల ఓ భవంతిలోకి తీసుకు వెళతారు. అక్కడ మొదట అంతా బానే ఉంటుంది. అయితే... ఓ అమ్మాయి కళ్ళు తిరిగి పడిన తర్వాత జరిగిన పరిణామాలు యశోదను ఆలోచనలో పడేసినట్టు అర్థం అవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించడం.. ఆమెపై ఎటాక్ జరగడం.. తదితర దృశ్యాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. 'యశోద'లో సరోగసీ అంశంతో పాటు రాజకీయం, మర్డర్ మిస్టరీ, ప్రమాదం అంచున ఓ మహిళ చేసిన పోరాటం ఉన్నాయని స్పష్టం అవుతోంది.

 'యశోద ఎవరో తెలుసు కదా! ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి' అని సమంత చెప్పే మరో డైలాగ్‌లో హీరోయిజం ఉంది. అయితే... ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత కలియుగ పద్మవ్యూహంలో చిక్కుకున్న 'యశోద', దాన్నుంచి బయట పడటం కోసం పోరాటం చేసినట్లు అనిపిస్తుంది. 

'యశోద' ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), తమిళంలో సూర్య (Hero Suriya), హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో 'మహానటి', 'సీతా రామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!