త్రివిక్రమ్‌ సినిమాకి ఆ మ్యూజిక్ డైరెక్టర్‌‌ వద్దంటున్న మహేష్‌బాబు (Mahesh Babu)?

Updated on Jun 12, 2022 08:11 PM IST
మహేష్‌బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్
మహేష్‌బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్‌ ఇచ్చిన కిక్‌తో, తన తర్వాతి సినిమాపై ఫోకస్‌ పెట్టాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను పట్టాలెక్కించాడు. మహేష్‌ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా అంటే సాధారణంగానే కొన్ని అంచనాలు ఉంటాయి.

ఇక, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట లాంటి వరుస హిట్‌ సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో, త్రివిక్రమ్‌తో సినిమా అంటే మహేష్‌ అభిమానుల అంచనాలు మరో రేంజ్‌కు వెళ్లిపోతాయి. ఆ అంచనాలను అందుకునేలా సినిమాను తెరకెక్కించాల్సిన బాధ్యత దర్శకుడితోపాటుగా హీరోకి కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమా విషయంలో మహేష్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది.

మహేష్‌–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో 'అతడు' సినిమాలో మహేష్‌తో సైలెంట్‌గా డైలాగ్స్‌ చెప్పించిన త్రివిక్రమ్.. తర్వాత చేసిన 'ఖలేజా' సినిమాలో మహేష్‌లోని మరో విభిన్న కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.  ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీగా హంగామా చేయలేకపోయినా.. మహేష్‌ డైలాగ్స్, అప్పియరెన్స్, పాటలు సినిమాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

మెప్పించలేదనేనా?..

ఇక, సర్కారు వారి పాట సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించాలని మహేష్‌ అనుకుంటున్నాడట. ఇందులో భాగంగానే 'సర్కారు వారి పాట' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోవడానికి గల కారణాలను కూడా మహేష్‌ విశ్లేషించుకుంటున్నాడని సమాచారం.

'సర్కారు వారి పా'ట సినిమాలో పాటలు అనుకున్న స్థాయిలో హిట్‌ కాలేదని, అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌‌కి కూడా మంచి మార్కులు పడలేదని మహేష్‌ అనుకుంటున్నాడని తెలుస్తోంది.

దీంతో త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాకు సంగీతం చేసే అవకాశాన్ని థమన్‌ను కాకుండా.. వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌‌కు చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడని సమాచారం. సోషల్‌ మీడియాలో అభిమానులు చేసే కామెంట్లలో కూడా ఇదే విషయం కనిపిస్తోంది. త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాకు థమన్‌ను కాకుండా వేరే వాళ్లను మ్యూజిక్ డైరెక్టర్‌‌గా సెలెక్ట్ చేయాలని పలువురు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

అలాగే, ఈ సినిమాలో థమన్‌ స్థానంలో అనిరుధ్‌ రవిచంద్రన్‌ను తీసుకుంటే బాగుంటుందని మహేష్‌బాబు (Mahesh Babu) కూడా అనుకుంటున్నాడట. చిత్ర యూనిట్‌ దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

Read More: యూట్యూబ్‌లో మహేష్‌బాబు (MaheshBabu) ‘మురారి వా’ పాట.. వైరల్‌ అవుతున్న వీడియో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!