మ‌హేష్ బాబు (Mahesh Babu) సినిమాకు సైన్యం టైటిల్‌ను ఎప్పుడో ఫిక్స్ చేసిన త్రివిక్ర‌మ్!

Updated on Jun 19, 2022 08:07 PM IST
మ‌హేష్ బాబు (Mahesh Babu) పదకొండు సంవత్సరాల త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు.
మ‌హేష్ బాబు (Mahesh Babu) పదకొండు సంవత్సరాల త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు.

టాలీవుడ్‌లో మ‌హేష్ బాబు (Mahesh Babu), త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేష‌న్‌లో విడుద‌లైన సినిమాలకు ఉన్న క్రేజే వేరు. మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు, ఖ‌లేజా సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. వీరిద్ద‌రు కాంబోలో సైన్యం సినిమా తెర‌కెక్కించాల‌నుకున్నారు. సైన్యం సినిమాతో హ్యాట్రిక్ కొట్టాల‌నుకున్నారు త్రివిక్ర‌మ్‌. కానీ సైన్యం సినిమా ప‌ట్టాలెక్క‌లేక‌పోయింది. 

మ‌హేష్ బాబు (Mahesh Babu) పదకొండు సంవత్సరాల త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. సైన్యం అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాలో మ‌హేష్ బాబుకు జోడిగా పూజ హెగ్డే క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ట‌. ప్ర‌ముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 
సైన్యం సినిమా ఎప్పుడో తెర‌కెక్కాంచాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మైంద‌ని ఎం.ఎస్ రాజు త‌న‌యుడు సుమంత్ అశ్విన్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన స్కిప్ట్ , ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్కులు చాలా రోజుల పాటు జ‌రిగాయ‌న్నారు. త్రివిక్ర‌మ్ ఎస్‌ఎస్‌ఎంబీ 28 సినిమా సైన్యం క‌థే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ బాబు (Mahesh Babu) 28వ  చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సౌత్ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!