Ponniyin Selvan1: 'యువ‌రాణి కుంద‌వై'గా మెరిసిపోతున్న త్రిష.. పొన్నియిన్ సెల్వ‌న్-1 లేటెస్ట్ అప్‌డేట్స్

Updated on Jul 07, 2022 04:25 PM IST
Ponniyin Selvan 1: పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రంలో యువ‌రాణి కుంద‌వైగా క‌నిపించ‌నున్న త్రిష‌.
Ponniyin Selvan 1: పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రంలో యువ‌రాణి కుంద‌వైగా క‌నిపించ‌నున్న త్రిష‌.

Ponniyin Selvan 1:త‌మిళ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం అత్యంత ప్ర‌తీష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వ‌న్ -1. స్టార్ హీరో హీరోయిన్ల‌తో మ‌ణిర‌త్నం భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రీసెంట్‌గా మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం అందాల తార త్రిష ఫ‌స్ట్ లుక్‌ను పొన్నియిన్ సెల్వ‌న్ -1 చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

యువ‌రాణి ప్రాత‌లో త్రిష‌
Ponniyin Selvan 1: పొన్నియిన్ సెల్వ‌న్ -1 చిత్రంలో యువ‌రాణి కుంద‌వైగా త్రిష వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. త్రిష ఎరుపు రంగు చీర‌లో ద‌ర్జాగా క‌నిపిస్తున్నారు. యువ‌రాణిలా ఒంటినిండా న‌గ‌లు ధ‌రించారు. త్రిష ర‌వివ‌ర్మ గీసిన చిత్రంలా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. విక్ర‌మ్, కార్తీ, ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌ (AishwaryaRaiBachchan)ల‌తో పాటు త్రిష ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 

 

Ponniyin Selvan 1: పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రంలో యువ‌రాణి కుంద‌వైగా క‌నిపించ‌నున్న త్రిష‌.

ద‌ర్శ‌క నిర్మాత‌గా మ‌ణిర‌త్నం
Ponniyin Selvan 1: పొన్నియిన్ సెల్వ‌న్ -1లో చోళ రాజుగా హీరో విక్ర‌మ్ న‌టిస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వ‌న్ ' చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. విడుద‌ల‌కు రెండు నెలల ముందు నుంచే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు. ఈ సినిమా టీజ‌ర్ జూలై 7న తంజావూరులోని బృహ‌దేశ్వ‌రా టెంపుల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Read More: మణిరత్నం (Mani Ratnam) ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ రిలీజ్‌ చేసిన మేకర్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!