మణిరత్నం (ManiRatnam) - కమల్‌హాసన్ (Kamal Haasan) కాంబో రిపీట్.. 35 ఏళ్ల తర్వాత మరో సినిమా

Updated on Nov 07, 2022 09:36 AM IST
నాయకుడు తర్వాత కమల్‌ హాసన్ (Kamal Haasan) – మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు ఉదయనిధి స్టాలిన్
నాయకుడు తర్వాత కమల్‌ హాసన్ (Kamal Haasan) – మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు ఉదయనిధి స్టాలిన్

లోకనాయకుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం ఇండియన్‌2 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ట్రెండ్ సెట్టర్‌‌గా నిలిచిపోయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్‌2 సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలాకాలం క్రితమే మొదలైనప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇటీవలే ఇబ్బందులు తొలగిపోవడంతో షూటింగ్‌ తిరిగి మొదలైంది.

లోకనాయకుడు కమల్‌హాసన్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి క్యారెక్టర్‌‌ ఇచ్చినా నూటికి నూరు శాతం న్యాయం చేయగలిగే సత్తా కమల్‌కు ఉంది. అయితే ఇంత టాలెంట్‌ ఉన్న ఆయన కొన్నేళ్లుగా సరైన హిట్‌ కోసం ఎదురుచూశారు. ఇటీవల వచ్చిన విక్రమ్ ఆ ఎదురుచూపులకు చరమగీతం పాడింది. విక్రమ్‌ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలోనూ అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా కమల్‌హాసన్ స్టామినాను బాక్సాఫీస్‌కు రుచి చూపించింది.

మణిరత్నం (Mani Ratnam).. సినిమాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వాళ్లకైనా పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశ సినిమా చరిత్రలో గర్వించదగిన దర్శకుల్లో మణిరత్నం పేరు ముందు వరుసలో ఉంటుంది. రోజా, దళపతి, నాయకుడు, దిల్‌ సే, సఖి, రావణ్‌, గురు, గీతాంజలి, అంజలి.. ఇలా చెప్పుకుంటూ పోతే మణిరత్నం తీసిన ప్రతి సినిమా ఒక రత్నమే. ఇటీవల ఆయన తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌‌–1 విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా రెండో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాయకుడు తర్వాత కమల్‌ హాసన్ (Kamal Haasan) – మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు ఉదయనిధి స్టాలిన్

ఫ్యాన్స్‌కు పండుగే...

కొన్నాళ్లుగా మణిరత్నం – కమల్‌హాసన్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందనే వార్తలు నెట్‌లో హల్‌చల్‌ చేశాయి. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం కమల్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కమల్‌హాసన్ అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్‌ 234వ సినిమా తెరకెక్కనుందని, ఆ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌ నిర్మించనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.

మద్రాస్ టాకీస్‌, రాజ్‌ కమల్ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్, రెడ్‌ జెయింట్ మూవీస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఏఆర్‌‌ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. 2024లో ఈ సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మణిరత్నం (Mani Ratnam) – కమల్‌హాసన్ (Kamal Haasan) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి. కమల్‌ హాసన్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన నాయకుడు సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.

Read More : కమల్ హాసన్ (Kamal Haasan) ‘భారతీయుడు2’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన కథా రచయిత!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!